వలస కూలీల వ్యథలు వర్ణణానీతం. ఒక కూలీది ఒక్కొక్కవిధమయిన అలుపెరగని జీవన సమరం. కూలీ కోసం ఉన్న వూరోదలి, అయినవాళ్లందరిని వదిలేసి వేలమైళ్ల దూరాన పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఏదో బాగా సంపాదించాలని కాదు, బతుకు దెరువు కోసమే. ఇపుడు లాక్ డౌన్ వీళ్ల బతుకులను బుగ్గిపాలు చేసింది. కూలీ పొగొట్టింది. నోటికాడి అన్నం గిన్నెను లాగేసుకుంది.
‘వలస కార్మికులను ఇళ్ళకు పంపవద్దు భోజనాలు పెట్టండి’ అని కేంద్రం చెప్పడం ఒక జీవితకాలం లేటు అయింది. అప్పటికే వాళ్లంతా ఉపాధిపోయిన వూరొదలి ఇంటి ముఖం పట్టారు. మధ్యలో అధికారులు నిలిపేసే ప్రయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ఒంగోలు పట్టణంలో ఇలాంటి దర్ఘటన జరిగింది. పట్ణణంలోని RISE ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ప్రభుత్వం వలసకూలీల కోసం ఒక షెల్టర్ ఏర్పాటుచేసింది. అక్కడ ఒక కూలీ తనని వూరెళ్లకుండా అపేసినందుకు నిరసనగా లారీకిందికి దూకే ప్రయత్నం చేశాడు.అయితే, అక్కడే ఉన్న ఒక ఎస్ఐ ఆయన్ని కాపాడారు.
https://trendingtelugunews.com/telugu/breaking/guntur-police-cane-the-migrant-labourers/
అందుకే ఎవరు ఆపినా, ప్రధాని డబ్బులిస్తున్నాడన్నా కూలీలు ఆగడం లేదు.
వేల కిలో మీటర్ల దూరానఉన్న తమగ్రామాలకు ప్రాణాలకు తెగించి జాతీయ రహదారుల వెంబడి, రైలు పట్టాల వెంబడి, అడువులగుండా ఎడాలరు గుండా పోతున్నారు. కొంతమంది ఆయాసమొచ్చి మధ్యలోనే చనిపోతున్నారు. మరికొందరు జాతీయ రహదారులమీద ప్రమాదాలలో చనిపోతున్నారు. ఈ వార్త రాస్తున్నపుడు తెలంగాణ నిర్మల్ జిల్లాలో కూలీలను తీసుకువెళ్తున్న లారీ బోల్తాపడింది. అదృష్ణ వశాత్తు ఎవరూ మరణించలేదు.కాని ఉత్తర ప్రదేశ్ లో అరయ్యా వద్ద జరిగిన ప్రమాదంలో మాత్రం 23 మంది చనిపోయారు.
కొంతమంది ఇళ్లు చేరే లోపు చనిపోతున్నారు. కొందరు ఇళ్లు చేరాక చనిపోతున్నారు. ఉపాధి వూర్లో ఉండలేరు, ఉండూరులో బతక లేరు. దీనితో భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుండటంతో చాలా మంది ఇంట్లో నే ఆత్మ హత్య చేసుకుంటున్నారు.
https://trendingtelugunews.com/telugu/breaking/this-labourers-leaves-for-chattishgarh-carrying-children-in-kavadi/