హైదరాబాద్ కూలీల లారీకి ఘోర ప్రమాదం, ఎవరూ మృతి చెందలేదు

నిర్మ‌ల్ ‌ జిల్లాలోభాగ్య‌న‌గ‌ర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంటి ముఖం పట్టిన వలస కూలీలను తీసుకువెళ్తున్న లారీ ఒకటి  జాతీయ ర‌హ‌దారిపై ఆదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టడంతో ఈ రోజు ఈ  ప్రమాదం జరిగింది. లారీలో 70 మంది వ‌ల‌స కార్మికులు ప్రయాణిస్తున్నారు.
ఈ కూలీలంతా లాక్ డౌన్ కారణంగా  హైద‌రాబాద్ లోఉపాధి కల్పోయిన నగరంలో బతక లేక సొంతవూరు ఎక్కడో ఉత్తర ప్రదేశ్ లో ఉన్న ఘోర‌ఖ్ పూర్  కు వెళ్ళుతున్నారు.

అదృష్టవశాత్తు ఎవరై మరణించలేదు. కాకపోతే 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరొక 20 మందికి స్ప‌ల్ప గాయాలతగిలాాయి.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏడుగురికి నిర్మ‌ల్ ఏరియా ఆసుప‌త్రిలో చికిత్స‌ చేస్తున్నారు. మరీ తీవ్రంగా గాయపడిన ఇద్ద‌రు క్ష‌త‌గాత్రుల‌ను హైద‌రాబాద్ కు త‌ర‌లించారు.
ఘటన స్థలాన్ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించారు.  ప్ర‌మాదంపై దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. వారందరికి  మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ వారిని ఘోర‌ఖ్ పూర్ కు త‌ర‌లించేందుకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కు  ఆదేశాలిచ్చారు.