భయం వద్దు, కరోనా వస్తే 80 శాతంలో మైల్డ్ గానే వుంటుంది : పరిశోధనలు

A little learning is a dangerous thing: Alexander Pope పద్యం గుర్తుందా. ఆసక్తి ఉన్న వారు A Little Learning నిఇక్కడ చదవవచ్చు. వాస్తవ జ్ఞానం లేకపోతే వచ్చే అనర్థాల గురించి ఈ చిన్న పద్యం చెబుతుంది. తప్పక చదవండి బట్టీ పట్టండి. సోషల్ మీడియాయుగానికి పనికొచ్చే పద్యం అది.
భయం అన్నికంటి కంటే ప్రమాదకరమయింది. సరైన విజ్ఞానం అందుబాటులో లేనపుడు మిడిమిడి జ్ఞానం భయాన్ని పుట్టిస్తుంది. పెంచిపోషిస్తుంది.
ఈ భయం తో మనం ప్రతి పుకారును నమ్మేస్తాం. ఇక సోషల్ మీడియా వచ్చాక, మనం నమ్మిన ప్రతిదాన్నిబలపరిచే దేన్నయినా, అది అబద్దమయినా, నిజమయినా, ఫేక్ న్యూసయినా, వెరిఫై చేయకుండా షేర్ చేయాలనుకుంటాం.
మనకు నచ్కకపోతే, నిజమయినా, అనుమానిస్తాం, నమ్మేందుకు సంశయిస్తాం. అందుకే కరోనా గురించి ప్రచారమవుతున్నదాంట్లో అవాస్తవాలు,భ్రమలు, అబద్దాలు, అర్థ సత్యాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే, ఇపుడు కొన్నిభ్రమల గురించి వాస్తవాలు తెలుసుకునేందుకు ఒక చిన్న ప్రయత్నం చేద్దాం.
కరోనా వచ్చిందటే చావు తప్పదా?
ఇది భ్రమ మాత్రమే. కరోనా సోకినంత మాత్రాన చావు భయం అవసరం లేదు. ఎందుకంటే కరోనా వల్ల మరణాలరేటు కేవలం 2.3 శాతం. ఇదేదో కాకిలెక్కనుకునేరు. చైనాలో వూహాన్ లో వచ్చిన కరోనాకేసులను అక్కడి శాస్త్రవేత్తలు, ప్రపంచ ఆరోగ్య నిపుణులు క్షుణ్ణంగా అధ్యయంన చేసి తెల్చిన మాట ఏంటంటే, కరోనా సోకినపుడు దాదాపు 80.9 శాతం మందిలో అది చాలామైల్డ్ గా అంటే చాలా స్వల్పంగా ప్రభావం చూపించడం గమనించారు.
వూహాన్ లో మొదటి కేసు రికార్డయిన 2019 డిసెంబర్ 31 నుంచి 40 రోజుల పాటు వచ్చిన రోగుల వివరాలను అంటే 72,314 మంది రోగుల రికార్డులను ఒక నిపుణుల బృందం (The Novel Coronavirus Pneumonia Emergency Response Epidemiology Team) పరిశీలించింది.
ఇందులో 44,672 (61.8 శాతం) మందిలో కరోనా నిర్ధారణ అయింది.16,186( 22.4 శాతం) కేసులు అనుమానిత కేసులు. మరొక 10,567(14.6 శాతం) కేసులు క్లినికల్లీ డయాగ్నోస్డ్ కేసులు, 889 (1.2 శాతం) కేసులులక్షణాలే లేని (asymptomatic) కేసులు.నిర్ధారణ అయిన కేసులలో 86.6శాతం మంది 30-79 సంవత్సరాల వయసున్నవారు.
ఈకేసులు పరిశీలిస్తే 80.9శాతం మందిలో కోవిడ్ -19 మైల్డ్ గా కనిపించింది. నిర్ధారణ అయిన కేసులలో 1023 మంది చనిపోయారు. ఇది 2.3 శాతానికి సమానం.
వూహాన్ నగరం ఉన్న హూబై రాష్ట్రంలో డిసెంబర్ నెలాఖరు 2019 నుంచి ఫిబ్రవరి 11, 2020,  31 రాష్ట్రాలలోని 1386 కౌంటీలలో కరోనా వ్యాపించింది.
జనవరి 23-26 కోవిడ్ -19 పతాక స్థాయికి చేరుకుంది.ఫిబ్రవరి 11 నుంచి తగ్గడం మొదలయింది.
ఈ మొత్తం కాలంలో మరణాల ట్రెండ్ ఇలా ఉంది:  మృతులలో 80 సంవత్సరాల లోపు వారు 14.8 శాతం ఉన్నారు. పురుషులు 2.8 శాతం ఉంటే, మహిళలలు 1.7 శాతమే. పదవీవిరమణ చేసిన వారిలో మరణాలు (5.1 శాతం) ఎక్కువగా ఉన్నాయి. షుగర్, బిపి వంటి కోమార్బిడ్ కండిషన్ (కోమార్బిడిటి అంటే ఏమిటి?)  లేని వారిలో మరణాలు చాలా చాలా తక్కువ, కేవలం 0.9 శాతమే. ఈ జబ్బులున్నవారిలో మరణాలు చాలా ఎక్కువ. గుండెసంబంధ
జబ్బులున్నవారు10.5 శాతం మంది చనిపోయారు. షుగర్ తో ఉన్నవారు7.3 శాతం , , దీర్ఘకాల శ్వాసకోశ జబ్బులున్నవారు6.3 శాతం, ,బిపితో ఉన్నవారు6 శాతం, క్యాన్సర్ తో ఉన్న వారు 5.6శాతం మృత్యవాత పడ్డారు. కోవిడ-19 జబ్బు క్రిటికల్ కండిషన్ కు వచ్చిన వారిలో మరణాలు 49 శాతం ఉన్నాయి.
చివరకు ఈ బృందం తెల్చిన విషయం ఇది:
“In light of this rapid spread, it is fortunate that COVID-19 has been mild for 81% of patients and has a very low overall case fatality rate of 2.3%. Among the 1,023 deaths, a majority have been ≥60 years of age and/or have had pre-existing, comorbid conditions such as hypertension, cardiovascular disease, and diabetes. Moreover, the case fatality rate is unsurprisingly highest among critical cases at 49%, and no deaths have occurred among those with mild or even severe symptoms.”
ఈ రీసెర్చ్ పేపర్ Vital Surveillances: The Epidemiological Characteristics of an Outbreak of 2019 Novel Coronavirus Diseases (COVID-19) — China, 2020 అనే శీర్షిక తో సిసిడిసి వీక్లీలోప్రచురితమయింది. దీని మీద క్లిక్ చేసి క్షుణ్ణంగా పరిశోధను పరిశీలించవచ్చు.
మరొక భ్రమ: అల్లం, నిమ్మరసం,తేనే, ఇతర సుగంధ ద్రవ్యాలు కోవిడ్ -19 ని నివారించవచ్చు
దీనికి ఇంతవరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ దినుషులకు కొద్దిగా బ్యాక్టీరియ వ్యతిరేక లక్షణాలుండవచ్చు. అయితే కోవిడ్ అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చేదికాదు. వైరస్ వల్ల వచ్చే రోగం.
భ్రమ: ఆవిరి పట్టినందున వైరస్ చచ్చిపోతుంది
ఆవిరి పీల్చి బిగపట్టినందున వైరస్ చావదు. అయితే, ఆవిరి ఎక్కువ వేడిగా ఉంటే ముక్కులలో బొబ్బలొచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త. (సోర్స్: ఇండియా బయోసైన్సెస్)
యాంటిబయాటిక్స్ ను కరోనా వైరస్ ను చంపేస్తాయి
ఇదొక భ్రమ. యాంటిబయాటిక్స్ అనే బ్యాక్టీరియా మీద ప్రయోగించే అస్త్రాలు మాత్రమే. వాటికి కరోనావైరస్ ను చంపే శక్తి లేదు.
ఎల్లిపాయ (Garlic) తింటే కరోనా వైరస్ దగ్గిరకే రాదు
కొన్ని రకాల బ్యాక్టీరియాల పెరుగుదలను మందగించే శక్తి ఎల్లిపాయ కుఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్న మాట నిజమే. కోవిడ్ బ్యాక్టిరియా వల్ల కాదు, వైరస్ వల్ల వచ్చే వ్యాధి. కోవిడ్ -19 నుంచి ప్రజలను కాపాడే శక్తి ఎల్లిపాయకు ఉందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు.
చైనా నుంచి దిగుమతి అయ్యేవస్తువుల వల్ల కరోన వ్యాపిస్తుంది
ఉత్తరాల మీదగాని , సరుకులపార్శిళ్ల మీద కరోనా వైరస్ ఎక్కువకాలం బతకలేదని చాలా పరిశోధనల్లో తేలింది. ఇతర కరోనావైరస్ లు అంటే SARS, MERS మీద ఈ పరిశోధనలు బాగా జరిగాయి. CDC (Centres for Disease Control and Prevention US) సమాచారం ప్రకారం ఇలాంటి ఉపరితలాల మీద చాలా కాలం బతికేంత శక్తి కరోనా వైరస్ కు లేదు. అంతేకాదు, చైనా నుంచి వచ్చే పార్శిల్లు చాలా కాలం పాటు పరిసరాల ఉష్ణోగ్రతలో ఎండిపోతుంటాయి. వీటి నుంచి వైరస్ ప్రభావం చాలా తక్కువ (very low risk).

Think your friend would be interested in this story? Please share it!

ఎండాకాలం వస్తూనే వేడికి వైరస్ చచ్చిపోతుంది
కొన్ని రకాల వైరస్ లు ముఖ్యంగా జలబ్బు, దగ్గు తెచ్చే వైరస్ లు శీతలవాతావరణలంలో సులభంగా వ్యాప్తి చెందుతాయి. అంతమాత్రం వేడి పెరగ్గానే అవి నశించిపోతాయని అర్థం కాదు. ఇక కరోనావైరస్ (SARS-COV-2) ఏ ఉష్ణోగ్రతలో ఎలా పనిచేస్తుందనే దాని మీద ఇంకా స్పష్టమయి విజ్ఞానం అందుబాటులో లేదు.
దోమలు, కీటకాల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది
కరోనా వైరస్ లేదా ఇతర కరోనా జాతి వైరసలు దోమల వ్యాప్తి చెందుతాయేందుకకు ఎలాంటి ఆధారాలు లేవు. సమాచారం లేదు. నావెల్ కరోనావైరస్ వ్యాపించే ప్రధానమయిన మార్గం మనుషుల ద్వారానే. కాబట్టి ఏ మనిషికి దగ్గరగా రాకుండా లేదా మనిషి నుంచి వచ్చే తుంపరలు పడనంత దూరంగా కనీసం రెండు మీటర్ల దూరం పాటించడం వల్ల నివారించేందుకు వీలుంది
కోవిడ్-19 సోకిన వ్యక్తి తో సామీప్యంగా ఉండినట్లు తెలిసినపుడు ఏం చేయాలి?
ఏకారణం చేతనయినా కోవిడ్ 19 ఉన్న వ్యక్తి త్ కాంటాక్ట్ అయినపుడు తీసుకోవలసి జాగ్రత్తలు:
ఇంటికి పరిమితం కావాలి. కోవిడ్ 19వచ్చినపుడు చాలా మందిలో రోగం చాలా స్వల్పంగా కనిపిస్తుంది. ఎలాంటి మందులు, చికిత్స అవసరం లేకుండా నయమైపోతుంది. అందువల్ల మీరు బెంబేలు పడి, అందరిని అదరగొట్ట వద్దు. ఇల్లొదలవద్దు. చికిత్సకు తప్పమరొక పనిమీద బయట తిరగవద్దు.
విశ్రాంతి తీసుకోండి. సమృద్ధిగా ద్రవాలు తీసుకోండి. మెడికల్ షాపులో దొరికే సాధారణ మందులు వాడవచ్చు. ఇంకా కావాలనుకుంటే మీ డాక్టర్ ను సంప్రదించండి. అయితే, ఎపుడయితే వూపిరి బరువెక్కినపుడు మీరు తప్పక డాక్టర్ ను సంప్రదించాలి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ షేరింగ్ ఆటోలు, టాక్సీలు మానండి.
 (source: Cetres for Disease Control and Prevention)