అట్టహాసంగా లిక్కర్ షాపులను తెరిచిన ప్రభుత్వానికి కోర్టులోపరాభవం ఎదురయింది.
కరోనా కంట్రోల్ చేసేందుకు విధించిన లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తి వేసే దాకా రాష్ట్రంలో లిక్కర్ షాపులను మూసేయాలని తమిళనాడు హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తమిళనాడుప్రభుత్వ సంస్థ TASMAC లిక్కర్ షాపులను తెరిచింది. జస్టిస్ వినీత్ కొఠారి, జస్టిస్ పుష్ప సత్యానారాయణ ల డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
మే 7న లిక్కర్ షాపులను ప్రారంభించేందుకు పాటించాల్సిన నియమాలేమిటో మే 6 తేదీన కోర్టు చాలా స్పష్టంగా తెలియచేసినా, వాటిని పూర్తిగా ఉల్లంఘించారని బెంచ్ అభిప్రాయపడింది. అయితే, ఆన్ లైన్ లిక్కర్ ను విక్రయించేందుకు కోర్టు అనుమతినిచ్చింది.
సోషల్ డిస్టెన్స్ ను కఠినంగా అమలుచేయాలని మే ఆరో తేదీన షరతు విధించింది. నలభై రోజుల మూసివేత తర్వాత గురువారం నాడు TASMAC రాష్ట్రంలోఉన్న 5300 షాపులలో 3700 షాపులను తెరిచింది. షాపులు ప్రారంభించిన ఏడు గంటల్లోనే 172 కోట్ల వ్యాపారం జరిగింది.
ఈ షాపుల దగ్గిర సోషల్ డిస్టెన్స్ నియమం పాటించకపోవడం, మద్యంప్రియులు షాపుల దగ్గిర సరుకు కోసం తోసుకోవడం కోర్టు దృష్టికి వచ్చింది. దీనితో కోర్టు ఈ రోజు మద్యం దుకాణాలను మూసేయాలని ఆదేశించింది.