వైజాగ్ గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికోటి రుపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి, ఆసుపత్రిలో చికిిత్స పొందుతున్న వారికి కూడా ఆయన ఎక్స్ గ్రేషియా ప్రకటిచారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శిచేందుకు,అక్కడి పరిస్థితి స్వయంగా గమనించేందుకు విశాఖకు చేరుకున్నారు.
స్థానిక కెజిహెచ్ లో చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆందోళన చెందవద్దని వారిని ఓదార్చారు. బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి వైద్యులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు.
గ్యాస్ లీక్ ఘటనలో ప్రమాదానికి గురైన వారిని ఉద్దేశించి మట్లాడుతూ కీలక హామీ ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎవరూ అధైర్యపడొద్దన్నారు. “చనిపోయినవారిని నేను తిరిగి తీసుకురాలేను కానీ మనసున్న వాడిగా వారి కుటుంబాలకు అండగా ఉంటాను” అని భరోసా ఇచ్చారు సీఎం జగన్.
చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే వెంటిలేటర్ మీద ఉన్నవారికి 10 లక్షల రూపాయలు, ఆసుపత్రి వార్డుల్లో ఉన్నవారికి లక్ష రూపాయలు, ఆ ప్రాంతంలో గ్యాస్ ప్రభావానికి లోనైన గ్రామాలలో 15000 కుటుంబాలకు ఒక్కొక్కటి కుటుంబానికి రు. 15 వేల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించారు.ఇలాగేప్రాథమిక చికిత్స చేయించుకుని వెళ్లి పోయిన వారికి రు. 25 వేల సాయం ప్రకటించారు.
గ్యాస్ లీకయిన వెంటనే స్పందించి ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా కాపాడేందుకు జిల్లా యంత్రాంగం తీవ్రంగా కృషి చేసిందని ఆయన అభినందించారు. వెంటనే స్పందించి గ్యాస్ బాధితులను ఆసుపత్రికి తరలించినందున సుమారు 378 మంది ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డారని జగన్ పేర్కొన్నారు.
ఆసుపత్రిలో చేరిన బాధితులంతా కోలుకుంటున్నారని కూడా ఆయన చెప్పారు.
One thought on “నేనున్నానన్న జగన్, గ్యాస్ లీక్ మృతుల కుటుంబాలకు కోటి సాయం”
One thought on “నేనున్నానన్న జగన్, గ్యాస్ లీక్ మృతుల కుటుంబాలకు కోటి సాయం”
Comments are closed.