కరోనా వ్యాక్సిన్ ఒక కలగా మిగిలిపోతుందా?: శాస్త్రవేత్తల్లో అనుమానాలు

ప్రపంచమంతా కరోనా బీభత్సం చూస్తున్నారు. చిన్నరాజ్యాలు, పెద్దరాజ్యాలు, అగ్రరాజ్యాలవుదామని కలలుకంటున్న దేశాలు,అగ్రరాజ్యాలు…అనికరోనా కంట్రోల్ చేయలేక తలకిందులవుతున్నాయి. ఏదో మానవాతీత శక్త వచ్చి ఆదుకోవదడమో లేదా మనిషిలోనే సహజంగా రోగనిరోధక శక్తి రావడమో తప్ప ఇప్పటికిప్పుడు కరోనాకు 100 శాతం పనికొచ్చే మందులేదు.  అటుచూస్తే వేల సంఖ్యలో ప్రజలు పిట్లల్లా రాలిపోతున్నారు. ప్రజలు ప్రభుత్వాలు మిగతా పనులన్నీ వదిలేసి,ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్లు, హోటళ్లు, ఫ్యాక్టరీలు, రైళ్లు, విమానాలు, ఓడలు మూసేసి కరోనాను అదుపులోకి తెచ్చుకోలేకపోయినా,  అదింకా విస్తరించకుండా ఉండేందుకు సతమతమవుతున్నాయి. ప్రజలంతా మానవ జాతికేదోశాపం తగిలిందేమో అనే నిస్పృహలో పడిపోయినపుడు అదుగో వ్యాక్సిన్ వస్తున్నదని,  ప్రపంచవ్యాపింతంగా అనేక కంపెనీలువ్యాక్సిన్ ను తయారు చేసుందుకు పరుగు పెడుగుతున్నాయని వార్తలొచ్చాయి. ఈ వార్తలను తీసుకుని ప్రభుత్వాలుప్రజలను శాంతింప చేసేందుకు అదిగో 12 నుంచి 18 నెలల్లో వ్యాక్సిన్ తయారవుతుందని చెబుతూ వూరిస్తూ వచ్చాయి. అయితే, వ్యాక్సిన్ అనేది 18 నెలల్లో తయారు కావడమనేది చాలా రిస్కీప్రపోజల్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిమీద సిఎన్ ఎన్ ఒక ఆసక్తికరమయిన కథనం ప్రచురంచింది.
వ్యాక్సిన్ ల చరిత్రలో ఎపుడూఒక వ్యాక్సిన్ ఇలా ఎమర్జన్సీ గా తయారు చేయలేదు. చేయలేకపోయారు కూడా. దీనికి హెచ్ ఐ వి (HIV) వ్యాక్సిన్ ప్రయత్నాలను ఉదహరిస్తున్నారు. 1984 ఏప్రిల్ 23న  అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (HHS) సెక్రెటరీ మార్గరెట్ హెక్లెర్ ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. అమెరికా గే (Gay) లలో నిరోధకశక్తిని హరిస్తున్న జబ్బును ఎయిడ్స్ కు ఒక వైరస్ కారణమని ప్రకటించారు. అదే తర్వాత HIV అని పేరు పడింది. ఈ వైరస్ ను అమెరికా శాస్త్రవేత్తలు వేరు  చేయగలిగారని, అందువల్ల ఎయిడ్స్ కు వ్యాక్సిన్ తయారయిన పరీక్షలకు వెళ్లేందుకు రెండేళ్లు చాలునని ప్రకటించారు. ఇది బాగానే ఉంది. ఇప్పటికి ఈ ప్రకటన వెలువడి నాలుగు దశాబ్దాలయింది.  ఎయిడ్స్ వాధితో ఇంతవరకు  32 లక్షల మందిచనిపోయారు. హెక్లెర్ ప్రకంటిచిన వైరస్ ఇంకా రానేలేదు.

https://trendingtelugunews.com/english/features/cidrap-scientist-predict-corona-may-not-last-before-2022/

ఎయిడ్స్ వచ్చిన వాళ్లు ఎలాంటి అమానుష వాతావరణంలో చనిపోతున్నారో అందరికీ తెలుసు.ప్రపంచంలో పేరు మోసిన కంపెనీలన్నీ ఎయిడ్స్ వ్యాక్సిన్ తయారీలో మునిగిపోయినవే. మరీ వ్యాక్సిన్ ఏమయింది?
ఎయిడ్స వ్యాక్సిన్ అన్వేషణ 1980దశకంలోనే ముగియలేదు.  1997లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అమెరికా శాస్త్రవేత్తలకు ఒక సవాల్ విసిరారు. ఒక దశాబ్దం టైం ఇస్తున్నాను, హెచ్ ఐ వికి వ్యాక్సిన్ కనుగొనండని,,అది అమెరికా శాస్త్రప్రపంచానికి అదొక లక్ష్యం కావాలి అని ఆయన సవాల్ విసిరారు. వ్యాక్సిన్ తయారు కాలేదు ఇప్పటికీ.
2006లో  ప్రపంచాన్ని కుదిపేస్తున్నా ఎయిడ్స్ వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేయడంలో ఎందుకు జాప్యమవుతూ ఉందనే ప్రశ్న తలెత్తింది. ఎయిడ్స్ మొట్టమొదటి కేసు 1981లో ఎదురయింది.ఇప్పటికే వ్యాక్సిన్ తయారు కావడం లేదు. బిల్ అండ్ మెలిండా గేట్స్ పౌండేషన్ వాళ్లు 287మిలియన్ డాలర్ల ఫండ్ ను ఎయిడ్స్ వ్యాక్సిన్ రీసెర్చ్ కు అందించారు. ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్ లు జరుగుతూనే ఉన్నాయి. GlaxoSmithKline, Merck, Novartis, Sanofi-Aventis, Wyeth వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఎయిడ్స్ మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. 2005లోనే ప్రయివేటు ఇండస్ట్రీ 75 మిలియన్ డాలర్లను ఎయిడ్స్ వ్యాక్సిన్ పరిశోధనకు కేటాయించింది.  అమెరికా ప్రభుత్ మరొక 759 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. మరి వ్యాక్సినేమయింది?
చివరకు డ్రగ్ కంపెనీలు ఎయిడ్స్ వ్యాక్సిన్ మీద ఖర్చు చేసేందుకు సుముఖంగా లేని పరిస్థితి వచ్చింది.
హెచ్ ఐ వి వ్యాక్సిన్ తయారు చేయడం కష్టం కావడానికి కారణం ఈ వైరస్ ఒక సారి సోకడంతోనే స్వరూపం మార్చుకుంటున్నది. ఇది వైరస్ ల స్వభావం. ఇన్ ఫ్లుయంజా వైరస్  ప్రతిసంవత్సరం కొత్త అవతారం (mutation)ఎత్తుతుంది.అందువల్ల పాత వైరస్ మళ్లీ మీకు సోకదు. కాని,కొత్త అవతారం మీ మీద దాడి చేస్తుంది. వైరస్ అనేది మీ శరీరంలోనే అనేకావతారాలెత్తుతూ ఉంటుంది.అంటే హెచ్ ఐ వి సోకినపుడు రోగి శరీరంలో వైరస్  శతసహస్రావతరాలలో ప్రత్యక్షమవుతూ ఉంటుందని  రోటావైరస్ వ్యాక్సిన్ ను కనిపెట్టిన వాళ్లలో ఒకరైన పాల్ ఒఫిట్ ( ప్రఖ్యాత  చిన్న పిల్లల వైద్యనిపుణుడు, అంటువ్యాధుల నిపుణుడు) సిఎన్ ఎన్ కు చెప్పారు.
It continues to mutate in you, so it’s like you’re infected with a thousand different HIV strands: Paul Offit
హెచ్ ఐ వి  వ్యాక్సినే కాదు, డెంగీ పీవర్ వ్యాక్సిన్ పరిస్థితి కూడా ఇంతే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సమాచారం ప్రకారం  డెంగీ పీవర్  ప్రపంచవ్యాపితంగా ప్రతి ఏడాది 400,000 మందికి సోకి పీడిస్తూ ఉంది. 2017లో వివాదాస్పదం కావడంతో ఒక వ్యాక్సిన్ ను చివరకు ఉపసంహరించకున్నారు. ఎందుకంటే దీనివల్ల  రోగలక్షణాలు తీవ్రంకావడం కనిపించింది.

https://trendingtelugunews.com/telugu/breaking/us-clears-drug-for-covid19-treament-remdesivir-gets-fda-approval/

ఇలాగే   సాధారణ రైనో వైరస్( rhinoviruses)లకు, ఎడినో వైరస్ (adenoviruses)లకు(ఇవి కూడా కరోనా వైరస్ లాగా జలుబు దగ్గు రోగలక్షణాలు చూపిస్తుంటాయి)వ్యాక్సిన్ రూపొందించడం సాధ్యం కావడం లేదు. ఎడినో వైరస్ కు చెందిన రెండు రూపాలకు ఒకే వ్యాక్సిన్ తయారయింది.ఇది మార్కెట్లోకి రాలేదింకా.
వ్యాక్సిన్ తయారు కావడమనేది చాలా బాధాకరంగా సాగే నిదానమయిన ప్రక్రియ అనిడా. డేవిడ్ నబారో (David Nabarro) అంటున్నారు. ఆయన లండన్ ఇంపీరియల్ కాలేజీలో  గ్లోబల్ హెల్త్ ప్రొఫెసరే కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కోవిడ్ -19కు ప్రత్యేక రాయబారి కూడా. చాలా వైరస్ లకు వ్యాక్సిన్లే లేవని ఆయన చెప్పారు. ‘ఒక వ్యాక్సిన్ తయారవుతుందని కచ్చితంగా చెప్పనేలేం. ఒక వేళ వ్యాక్సిన్ తయారయినా,అది అన్ని పరీక్షలు పాసవుతుందని, మనుషులకు సురక్షితమనే గ్యారంటీ లేదు,’ అని ఆయన అన్నారు.
We can’t make an absolute assumption that a vaccine will appear at all, or if it does appear, whether it will pass all the tests of efficacy and safety: Dr. David Nabarro
 ఎమర్జన్సీ వచ్చిందని ఇంతవరకు ఎపుడూ వ్యాక్సిన్ డెవెలప్ చేసే కాలాన్ని 18 నెలలకు కుదించనే లేదు అని  అమెరికా హుస్టన్ ‘బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్’ కు చెందిన నేషనల్ స్కూల్ ఆప్ ట్రాపికల్ మెడిసిన్ డీన్ డాక్టర్ పీటర్ హోటెజ్ అన్నారు. దీనర్థం వ్యాక్సిన్ రూపొందించడం అసాధ్యమని కాదు, అదొక సాహప కార్యం (It doesn’t mean it’s impossible, but it will be quite a heroic achievement) అని ఆయన అన్నారు.
అందువల్ల ఈ పరిస్థితే అంటే వ్యాక్సిన్ అందుబాటులోకి పరిస్థితే కోవిడ్ -19 కి ఎదురయితే మనగతేంటి?
ప్లాన్ బి కోసం ప్రపంచం సిద్ధం కావాలి. కరోనాను సంహరించ లేకపోతే, సహజీవనానికి రెడీ కావాలన్నదే ఈ ప్లాన్ బి.
ఉదాహరణకు ఎయిడ్స్  కు వ్యాక్సిన్ రాలేదు.ప్రపంచమాగిపోలేదు. ప్రిఎక్స్ పోజర్ ప్రొఫైలాక్సిస్ (pre-exposure Prophylaxis –PrPE) గుళికలొచ్చాయి. ఇది  హెచ్ ఐ వి బారిన పడకుండా లక్షలాది మందిని కాపాడింది.
PrPE అంటే ఏమిటో ఇక్కడ చదవండి
ఇలాగే కరోనా కోసం వ్యాక్సిన్ రూపొందించడంతో పాటు, మరొక వైపు  ప్లాన్ బి సిద్ధం చేసేందుకు శాస్త్రవేత్తలు పోటీపడుతూనే ఉన్నారు.  ఇందులోరెమ్డిసివిర్ ఇందులో ఒకటి. ఇంకా ఏమేమి ముందుకొస్తాయేచూద్దాం.

https://trendingtelugunews.com/english/features/why-novel-coronavirus-vaccine-development-being-delayed/