మద్యం దుకాణాల తెరవడం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజత్ భార్గవ్ కామెంట్స్….
లికర్ షాపులను రేపు ఉదయం నుండి తెరుస్తున్నాం. ఉదయం 11 నుండి రాత్రి 7 వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. మద్యం అమ్మకాల పై మార్గదర్శకాలు జిల్లా కలెక్టర్ లకు పంపాం. మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలి. షాపులో కౌంటర్ దగ్గిర కేవలము 5 మందిని మాత్రమే అనుమతి ఇస్తాం. షాపుల ముందు సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తాం. మాస్క్ లేనిదే మద్యం దుకాణాలకు అనుమతి లేదు. రద్దీ మరీ ఎక్కువ గా ఉంటే ఆ షాపులు కొంత సమయం మూసివేస్తాం. బార్ లు ఎట్టిపరిస్థతుల్లోనూ ఓపెన్ చేయకూడదని నిర్ణయించాం.
కంటైన్మెంట్ జోన్ బయట మద్యం అమ్మకాలకు అనుమతినిచ్చాం. మద్యం ధరలు దాదాపు 25 శాతం పెంచుతున్నాం. మద్యం అమ్మకాలు తగ్గించేందుకు ధరలు పెంచుతున్నాం. ధరలు ఎంత పెరుగుతాయి అనేది రాత్రి లోపు ప్రకటిస్తాం. మాస్క్ లేక పోతే క్యూ లైన్ లో కూడా ఉండనివ్వం.