మరో రెండేళ్లు కరోనా మహమ్మారితో వేగాల్సిందే : CIDRAP శాస్త్రవేత్తలు

(TTN Desk)
కరోనా వైరస్ మహమ్మారి ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలేటట్లు లేదు. కనీసం మరొక రెండేళ్ల పాటు పీడించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా విడుదలయిన ఒక కరోనా పరిశోధన నివేదిక ప్రకారం ప్రపంచజనాభాలో మూడింట రెండు శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చి ఇమ్యూనైజేషన్ చేసే దాకా కరోనాను నియంత్రించడం కష్టమని ఈ నివేదిక చెబుతూ ఉంది.
నివేదికను అమెరికా మినెసోటా యూనవర్శిటీకి చెందిన  సెంటర్ ఫర్ ఇన్ ఫెక్షియస్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాలసీ (Center for Infectious Disease Research and Policy :CIDRAP) రూపొందించింది.
కరోనా మీద వచ్చిన పరిశోధనలను, ప్రపంచ వ్యాపితంగా కరోనాను నియంత్రించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను, కరోనా జబ్బు, మరణాలను అన్నింటిని అధ్యయనం చేశాక ఈ సంస్థ COVID-19: The CIDRAP Viewpoint అనే పేరుతో ఈ నివేదిక విడుదల చేసింది.
ఈ సంస్థ డైరెక్టర్ క్రిష్టిన్ ఎ. మూర్, డాక్టర్ మార్క్ లిప్ సిచ్ (Dr Marc Lipsitch), జాన్ ఎమ్ బారీ, మైఖేల్ టి ఓస్టర్ హోమ్ లు ఈ నివేదిక రూపొందించారు.
కరోనా సోకినా రోగలక్షణాలుండవుకాబట్టి, ఇలాంటి వారి నుంచి కరోనా వ్యాపిస్తూ ఉంటుందని, దీని వల్ల ఈ వైరస్ ను , ఇన్ ఫ్లుయంజా వైరస్ లాగా నియంత్రించలేమని ఈ నివేదిక పేర్కొంది. కరోనా వైరస్ సోకి ,రోగ లక్షణాలు కన్పించేలోపే ప్రజలు కోవిడ్ ను బాగా వ్యాప్తిచేసే స్థితిలో ఉంటారని ఈ నిపుణులుచెబుతున్నారు.
Think your friends would be interested? Share this story!
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రపంచమంతా లాక్ డౌన్ విధించిన తర్వాత, ఇపుడు దేశాలన్నీ లాక్ ఎత్తి వేసి జనసంచారానికి వీలుకల్పిస్తున్నాయి. దీనివల్ల కరోనా మహమ్మారి అలలుఅలలుగా కొనసాగే అవకాశం ఉందని, అది 2022 ను దాటి పోవచ్చని వారుచెబుతున్నారు.
కరోనా గురించి ప్రజలను అప్రమత్తం చేసే ప్రభుత్వాలు ఈ మహహ్మారి అంతతొందరగా పారిపోదనే సందేశాన్ని తప్పనిసరిగా చెబుతూ ఉండాలని ఈ నివేదిక హెచ్చరిస్తూ ఉంది.
అపుడపుడు కరోనా విజృంభిస్తుందని, ఈ పీడ విరగడ కావాలంటే కనీసం మరొక రెండేళ్లు పడుతుందని, అందువల్ల దీనికి తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రజలను సమాయత్తం చేయాలని ఈ నివేదిక స్పష్టం చేసింది.
వ్యాక్సిన్ తయారీ గురంచి సమాచారం అందుతూ ఉన్న ఈ ఏడాది చివరి నాటికి ఏదో కొద్ది మోతాదులో మాత్రమే వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. భారీగా వ్యాక్సిన్ ఉత్పత్తి అయిన ప్రపంచదేశాలన్నింటికి అందుబాటులోకి రావాలంటే చాలా సమయం పడుతుంది. అంతవరకు ఈ వ్యాధి వ్యాపిస్తూనే ఉంటుందని ఈ నిపుణులు చెప్పారు.

https://trendingtelugunews.com/telugu/breaking/us-clears-drug-for-covid19-treament-remdesivir-gets-fda-approval/

మామూలు ఇన్ ఫ్లుయంజాకు, కోవిడ్ -19కు ఉన్న తేడా ఏమిటి? మామూలు ఇన్ ఫ్లుయంజా పొదిగే కాలం (Incubation period) ఒకటి నుంచి నాలుగు రోజులు, కోవిడ్ పొదిగే కాలం 2 నుంచి 14 రోజులు. 14 రోజుల ఇంకుబేషన్ పీరియడ్ వల్ల పరీక్షలు కనిపెట్టే లోపు ఇది చాలా మందికి చడీ చప్పుడు లేకుండా పాకుతూ పోయి అంటుకుంటుంది. ఇలా కరోనా ప్రభావం కనిపించనందున మొదట్లో చాలా దేశాల ప్రభుత్వాలు మా దేశానికి కరోనా సోకదని, మా ఉష్ణోగ్రత లో కరోన బతకదని ఏవేవో చెప్పుకున్నారు. అయితే, వాళ్లు గుర్తించే సరికి కొంపలంటుకున్నాయి. వేలాది మంది చినపోయారు.
కరోనా వైరస్ వల్ల మృతుల సంఖ్య ఎక్కువగా ఉండేందుకు కారణం రోగలక్షణాలు బాగా ఆల్యస్యంగా కనిపించడమే. అంటే రోగల క్షణాలు కనిపించే నాటికి రోగి శరీరంలో కరోన భారం (viral load) తీవ్రంగా ఉంటున్నది. మూమూలు ఇన్ ఫ్లుయంజాలో కూడా రోగలక్షణాలు కనిపించకపోయినా, కరోనా విషయం ఈ పరిస్థితి ప్రమాదకరంగా తయారయింది.
1700 సంవత్సరం నుంచి ఇప్పటి దాకా ప్రపంచంలో ఎనిమిది సార్లు రకరకాల మహమ్మారులు ప్రపంచం మీద దాడి చేసినట్లు రికార్డయింది. ఫలానా కాలంలోనే ఇలాంటి రోగాలు, (ఏండాకాలంరావు అనే వాదన) వస్తాయనే ఒక క్రమమేమీ ఇందులో కనిపించేలేదు. ఇందులో రెండు సార్లు ఉత్తరార్ధ గోళంలో శీతాకాలంలో వచ్చాయి. మూడుసార్లు స్పింగ్ కాలం (మార్చి ఏప్రిల్ మే), ఒక సారి వేసవిలో , మరొక సారి శిశిరం (సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య)లో వచ్చింది. ఇందులో ఏడు సార్లు, తొందరగా ముదిరి మానవ ప్రమేయం పెద్దగా లేకుండా ముగిసాయి. అయితే, ఆరు నెలల తర్వాత ఈ ఏడు మహమ్మారులు మరొక సారి తిరగదోడాయి. కొన్ని మహమ్మారులు మొదటి సారి వచ్చాక రెండేళ్ల పాటు అపుడపుడూ వచ్చిపోతూనే ఉన్నాయి.ఇందులో ఒక్కటి మాత్రం అంటే 1968లో ఉత్తరార్ధ గోళంలో వచ్చిన మహమ్మారి మాత్రం ఒక రుతు క్రమం పాటిస్తూ రెండుసార్లు శీతాకాలంలోనే వచ్చింది.2009-10లో అమెరికాను కుదిపేసిన మహహ్మారి వ్యాక్సినేషన్ తో కంట్రోల్ అయినా, వ్యాక్సిన పెద్ద మొత్తంలో వెంటనే అందుబాటులోకి రాలేకపోయింది. వ్యాక్సిన్ ఆరునెలల తర్వాత అందుబాటులోకి వచ్చింది. ఇది చాలా ప్రాణనష్టాన్నినివారించిందని చెబుతారు.
అనుభవాల రీత్యా కోవిడ్-16 అంతసులభంగా మనల్నివదలని, అపుడపుడు వచ్చి దాడి చేసి పోతుంటుందని, ఇది ప్రపంచవ్యాపితంగా కాకపోయినా, కొన్ని ఖండాలకో ప్రాంతాలకో (Geographical regions) పరిమితమవుతుందని, ఇలా 2022 దాకా కనిపిస్తుందని CIDRAP శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండో దశలో కనిపించే కరోనా వ్యాప్తి అనేదిదేశాలు ప్రజల వలసలను ఎలా నియంత్రించగలరనే దాన్ని బట్టి ఉంటుందని వారు చెబుతున్నారు. అందువలకల ప్రపంచవ్యాపింతంగా కరోనా కేసులు కనిపిస్తూనే ఉంటాయి, రోగులు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారని ఈ నివేదిక హెచ్చరించింది.
ఈ నివేదిక పూర్తి పాఠం ఇక్కడ ఉంది. ఆసక్తి ఉన్నవారు చదవుకోవచ్చు.