ఆంధ్రప్రదేశ్ వేయి కేసుల వైపు పరుగు పెడుతూ ఉంది. రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కరోనా కేసుల సంఖ్య 955కి చేరింది. ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక బులెటీన్ వెల్లడించింది.
గడచిన 24 గంటలలో వరకు 6306 మంది నుంచి శాంపిల్స్ సేకరంచి పరీక్షలు చేస్తే వారిలో 62 మంది కి పాజిటివ్ ఫలితమొచ్చింది. ఇందులో కర్నూలు నుంచి 27, గుంటూరు 11, అనంతపురం 4, తూ గో 2, తూర్పుగోదావరి జిల్లా 6, కృష్ణా 14, ప్రకాశం 3, నెల్లూరు జిల్లాలో 1 కేసు చొప్పున నమోదయ్యాయి.
ఇపుడు అత్యధికంగా 261 కేసులతో కర్నూలు జిల్లా నెంబర్ వన్ కాగా, గుంటూరు జిల్లా రెండో స్థానంలో ఉంది. అక్కడ 206 కేసులు నమోదయ్యాయి.
గడచిన 24 గంటల్లో అనంతపురం, కర్నూలు ఒకొక్కరు మృతి చెందారు.మొత్తంగా కరోనావల్ల మృతి చెందిన వారి సంఖ్య 29 కిచేరింది.
ఇది ఇలా ఉంటే , 145 మంది కరోనా పాజిటివ్ రోగులు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇపుడు వివిధ ఆసుపత్రుల్లో 781 మందికి చికిత్స కొనసాగుతున్నది.