కంట్రోలు కొచ్చిన సౌత్ కొరియా కరోనా, పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం

ప్రపంచంలోని అగ్రరాజ్యాలన్నీ కరోనాతోసతమవుతున్నాయి.  క్రీడలతో సహా అన్ని జాతీయ కార్యక్రమాలను వాయిదావేసుకున్నాయి. అయితే, ఒక్కసౌత్ కొరియా మాత్రమే దీనికి భిన్నంగా ఉంది.  మూతికి ముసుగులు వేసుకుని కొరియన్ లంతా వచ్చే బుధవారం నాడు పార్లమెంటు ఎన్నికల్లోఓటేయబోతున్నారు. వారి ఈ ధైర్యానికి కారణం సౌత్ కొరియాలో కరొనా వైరస్ అదుపులోకి రావడమే. అక్కడ 44 మిలియన్ల మంది వచ్చే బుధవారం ఎన్నికల్లో ఓటేస్తారు.
చైనా తర్వాత వెంటనే కరోనబారిన పడిన దేశం సౌత్ కొరియా. అదే విధంగా చైనా తర్వాత తొందరగా కోలుకుంటున్న దేశం కూడా సౌత్ కొరియాయే.సౌత్ కొరియాలో కరోనా కంట్రోల్ తప్పిందని అంతా రాశారు. అటువంటి సౌత్ కొరియా వ్యవూహాలను మార్చి వైరస్ ను అదుపు చేసింది.
సౌత్ కొరియాలో పాజిటివ్ కేసులు బాగా తగ్గిపోతున్నాయి కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా బాగా ఎక్కువగా ఉంది. సౌత్ కొరియాలో మొదట కరోనా విజృంభించిన దేగు (Daegu)లో మొట్టమొదటి సారిగా కొత్త కేసులు శూన్యమయ్యాయి. ఈ పట్టణం నుంచి శుక్రవారంనాడు ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.అదే విధంగా దేశవ్యాపితంగా కూడా కరోనాకేసులు బాగా తగ్గిపోతున్నాయి. డేగు నుంచి 6807 కేసులు నమోదయ్యాయి. సౌత్ కొరియా మొత్తం సగం ఇక్కడి నుంచే వచ్చాయి. అయితే, ఇపుడు డేగు కరోనా వ్యాప్తిని అరికట్ట గలిగింది. కొరియా మొత్తంగా శుక్రవారం నాడు కేవలం 27 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయని కొరియా సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (KCDC) ప్రకటించింది. దేశంలో రికార్డయిన 10450 కేసులలో ఇంతవరకు 7117మందికి కోవిడ్ -19 జబ్బు నయమయింది. 3125 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.
* శుక్రవారం నాడు మరొక నాలుగు మరణాలు సంభవించడంతో కొరియాలో చనిపోయిన వారి సంఖ్య 208 కి చేరింది. జబ్బు అదుపులోకి రావడంతో కొరియా పార్లమెంటు ఎన్నికలకు సిద్దమయింది. వచ్చే బుధవారం పోలింగ్ రంగం సిద్ధమవుతూ ఉంది. కరొనా పాజిటివ్ కేసులకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మూడు వందలమంది పార్లమెంటు (నేషనల్ అసెంబ్లీ ) సభ్యులను ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
* లాక్ డైన్ ఎత్తేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నది. ఎందుకంటే లాక్ డౌన్ కొనసాగితే 1.8 కోట్ల మంది ఊపాధి కోల్పోయే ప్రమాదం కనపడుతూ ఉంది. అందువల్ల అంచెలంచెలుగా లాక్ డౌన్ ఎత్తి వేసేందుకు యోచిస్తున్నట్లు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఫిరదౌస్ ఆషిక్ ఆవాన్ తెలిపారు.
* మరొక వైపు ప్రపంచ్యాపితంగా కోరాన విషాదం మృతుల సంఖ్య 1,00,000 (అక్షరాల లక్ష)కు చేరుకోబోతున్నది.జాన్స్ హాప్ కిన్స్ యూనివర్శిటీ సేకరిస్తున్న వివరాల ప్రకారం ఏప్రిల్ పదో తేదీనాటికి మృతుల సంఖ్య 96వేలు దాటింది.అయితే, అమెరికా తో పాటు అనేక దేశాలలో మృతుల సంఖ్య బాగా పెరుగుతున్నందున ఇదిచూస్తుండగానే లక్షకు చేరుకుంటుందన నిపుణులు చెబుతున్నారు.
ఇంతవరకు ఇటలీలో 18300 మందిచనిపోయారు. అమెరికాలో 16,686 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క న్యూయార్క్ నగరం నుంచే 5 వేల మంది పైబడి చనిపోయారు. ఇక మిగతా దేశాలకు వస్తే, స్పెయిన్ లో 15,447 మంది చనిపోయారు. నిజానికి మృతుల సంఖ్య ఇప్పటికే లక్ష మించి ఉండాలి.ఎందుకంటే, ప్రపంచవ్యాపితంగా రికార్డవుతున్న వన్నీ ఆసుపత్రులలో చనిపోయిన వారి వివరాలే. ఆసుపత్రుల బయట చనిపోతున్న వివరాలు లెక్కలకెక్కడం లేదు.
* కరోనా లాక్ డౌన్ దెబ్బతో అమెరికాలో దాదాపు 1.7 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. కేవలం మూడువారాలలో వీరంతా రోడ్డున పడ్డారు. గురువారంనాటికి 66 లక్షల మంది అమెరికన్ వర్కర్లు నిరుద్యోగ భృతికోసం దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. అంటే ప్రతి పది మందిలో ఒకరు ఉపాధి కోల్పోయారు. ఇలాంటి సంకట పరిస్థతి ఎపుడో 1948 లో రెండోప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాకు ఎదురయింది. మళ్లీ ఇదే. ఏప్రిల్ అమెరికా నిరుద్యోగం 15 శాతానికి చేరుకునేఅవకాశాలున్నాయి.
* కరోనాసంక్షోభం ముగిసే లోపు కెనడాలో మృతుల సంఖ్య 22 వేలకు చేరుకుంటుందని అక్కడి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కనీసం 11వేల గరిష్టం 22 వేల మంది చనిపోతారని ప్రభుత్వం లెక్క కట్టింది. ఏప్రిత్ 16లోపే 500 నుంచి 700 దాకా చనిపోవచ్చని చెబుతున్నారు. ఇప్పటి దాకా కెనడాలో కరోనా మృతులు 435. రికార్డయిన పాజిటివ్ కేసులు 18,447. కరోనా లాక్ డౌన్ వల్ల ఇప్పటి దాకా 10 లక్షల మంది ఉపాధి కోల్పోయారు.
* అమెరికా నౌకాదళంలో ఆందోళన మొదలయింది.పసిఫిక్ లో ఉన్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నౌకలో 400 మంది సెయిలర్లకు కరోనా వైరస్ సోకిన తర్వాత మరికొన్ని నౌకదళానికి చెందిన నౌకలకు కూడా కరోన వైరస్ వ్యాపించ వచ్చని పెంటగన్ భావిస్తూ ఉంది.
* ఇది ఇలాఉంటే, బ్రిటిష్ ప్రధాని బొరిస్ జాన్సన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి బయటకు వచ్చారు. అయితే, ఆయన మరికొన్ని రోజలు ఆసుపత్రిలోనే ఉంటారని ఆయన తండ్రి స్టాన్లీ జాన్సన్ ప్రకటించారు. ఆసుపత్రినేరుగా ప్రధాని నివాసానికి పరిగెత్తి పరిపాలన పగ్గాపడతాడని అనుకోలేం. ఆయన కోలుకుని మామూలు మనిషి కావాలని ఆయన తండ్రి వ్యాఖ్యానించారు.
* ఇక నిన్న జర్మనీలో రికార్డు స్థాయిలో కోవిడ్ -19 వల్ల మృత్యు వాత పడ్డారు. CNN రిపోర్టు ప్రకారం గురువారం నాడు దేశవ్యాపితంగా 266 మంది చనిపోయారు. కరోనా లక్షణాలు బయట పడినప్పటి నుంచి ఒకే రోజు ఇంతమంది చనిపోవడం ఇదే మొదటి సారి అని జర్మనీ డిసీజ్ అండ్ కంట్రోల్ సెంటర్ పేర్కొంది.ఇంతవరకు జర్మనీలో 2373 మంది చనిపోయారు. శుక్రవారం  నాటికి జర్మనీలో నిర్ధారణ అయిన కోవిడ్ కేసులు 113, 525కు చేరుకున్కనాయి.  గత 24 గంటల్లో వచ్చి చేరిన కొత్త కేసులు 5, 323.

G