అన్ని బార్లు, షాపులులో స్టాక్ ను తనిఖీ చేయాలని ఎక్సైజ్ సిబ్బందికి ఆదేశం
షాప్స్ ఓపెనింగ్ తరువాత క్లోజింగ్ మరియు ఓపెనింగ్ స్టాక్ ని వెరిఫై చేయాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణస్వామి ఆదేశాలు:
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించి, మద్యం అమ్మకాలను నిషేధించింది. దీంతోపాటు అనధికారికంగా మత్తు పదార్ధాల విక్రయాలు జరిపినా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించినా చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌శాఖా మంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు.
లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేయకుంటే ఎక్సైజ్ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన అన్నారు. అన్ని బార్లు, మద్యం షాపుల్లో స్టాక్‌ను తనిఖీ చేసి, మళ్ళీ అమ్మకాలు ప్రారంభించిన తర్వాత ఓపెనింగ్ స్టాక్‌కు ఇప్పటి క్లోజింగ్ స్టాక్ సరిగా ఉందో లేదో వెరిఫై చేయాలని ఎక్సైజ్ సిబ్బందిని ఆయన ఆదేశించారు.
మద్యం విక్రయిస్తే టోల్‌ఫ్రీ నెంబర్లకు సమాచారమివ్వండి – ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వినీత్ బ్రిజ్‌లాల్ ప్రజలను కోరారు.
. టోల్ ఫ్రీ నెంబర్లుఇవే: 18004254868, 94910 30853, 0866 2843131.
మత్తుకు బానిసలైన కొంతమంది సహనం కోల్పోయి హానికర ద్రవాలు సేవించి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. వారి విషయంలో కుటుంబసభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.