విశ్వవిఖ్యాత న్యూరో సర్జన్, ముఖ్యంగా తలలు కలసి పుట్టిన పిల్లలను విడదీయడంలో ప్రపంచంలోనే మేటి అనిపించుకున్న న్యూరో సర్జన్ డాక్టర్ జేమ్స్ టి. గుడ్ రిచ్ కరోనా వైరస్ సోకి చనిపోయారు.
జటిలమయిన ఆపరేషన్లను సునాయాసంగా విజయవంతం చేసి ఎందరికో ప్రాణం దానం చేసిన డాక్టర్ ,అందునా అమెరికాలోనే పేరుమోసిన ఒక మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ కూడా ఆయన డాక్టర్ కోవిడ్ -19 తో చనిపోవడం విచారకరం.
కరోనా వైరస్ దాడితో అమరికా, ముఖ్యంగా న్యూయార్క్ పట్టణం తలకిందులవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్త రాస్తున్నప్పటికి న్యూయార్క్ సిటీలో వేయిమంది దాకా చనిపోయారు. ఈ న్యూయార్క్ ఉపద్రవానికే డాక్టర్ గుడ్ రిచ్ కూడా బలయ్యారు.
ప్రపంచవ్యాపితంగా నావెల్ కరొనా వైరస్ సోకిచనిపోయిన వారి సంఖ్య 42100కు పెరిగింది.
కరోనా వైరస్ బారినపడి అమెరికాలో చనిపోయిన రెండో వర్లడ్ ఫేమస్ సెలెబ్రిటీ ఈ డాక్టర్ . మొదటి వ్యక్తి ప్రఖ్యాత పాప్ సింగర్ , 1970 దశకం మధ్యలో ప్రపంచ యువతను I Love Rokc N Role గీతాన్ని రచించి పాడి వూర్రూత లూగించిన ఎలన్ మెర్రిల్.
డాక్టర్ గుడ్ రిచ్ సోమవారం నాడు కోవిడ్-19 వ్యాధి తీవ్రం కావడంతో మరణించినట్లు ఆయన పని చేస్తున్న ఆసుపత్రి మాంటిఫియోర్ హెల్త్ సిస్టమ్ ట్వీట్ చేసింది. ఆయన వయసు 73 సంవత్సరాలు.
The Montefiore @EinsteinMed community is mourning the loss of Dr. James T. Goodrich, world-renowned pediatric neurosurgeon. Dr. Goodrich passed away on March 30, 2020 from complications associated with COVID-19. Please see our full statement below. pic.twitter.com/nxPcKvPRG4
— Montefiore Health System (@MontefioreNYC) March 30, 2020