ఏవంటే అవి రాయొద్దు ప్లీజ్, కరోనా వార్తల మీద మీడియాకు ప్రభుత్వం సూచనలు…

కరోనా వైరస్‌పై కవరేజీ – పత్రికలు, టీవీఛానళ్ల అధిపతులు, ఎడిటర్లు, బ్యూరోచీఫ్‌లు, రిపోర్టర్లకు  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి  మార్గదర్శకాలు విడుదల చేశారు.
ఇవే మార్గ దర్శకాలు
– రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిరోజూ బులెటిన్‌ ఇస్తుంది. నిర్ధారించిన ఈ సమాచారాన్ని మాత్రమే పత్రికలు, టీవీలు పరిగణలోకి తీసుకోవాలి.
– కరోనా వైరస్‌ కేసుల విషయంలో, వైరస్‌ వల్ల మరణాల విషయంలో ఆ«ధీకృత సమాచారం కాకుండా, నిర్ధారణలేని సమాచారాన్ని ప్రచురించరాదు. ప్రసారం చేయరాదు. మార్చి 20వ తేదీన విశాఖలో కరోనా వైరస్‌ మరణం అటూ పలు వార్తసంస్థలు, ఛానళ్లు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నాం.
– అనుమానిత కేసుల పేరుతో సమాచారాన్ని ప్రచురించచారు, ప్రసారం చేయరాదు.
– కరోస్‌ వైరస్‌సోకి పాజిటివ్‌గా వచ్చిన కేసుల విషయంలో వారి పేర్లు, వారి చిరునామాలు ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు.
– వదంతులు, ఊహాజనిత అంశాలను ప్రసారం చేయరాదు, ప్రచురించరాదు.
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వెబ్‌సైట్లు, డబ్ల్యూహెచ్‌ఓ నిర్వహిస్తున్న వెబ్‌సైట్లను అనురించడంద్వారా వైరస్‌కు సంబంధించి సరైన సమాచారాన్ని పొందవచ్చు.
– మూఢ నమ్మకాలను వ్యాప్తిచేసేలా సమాచారాన్ని ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు.
– మార్గదర్శకాలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.
కరోనా వైరస్‌ నివారణలో, ప్రజలకు అవగాహన కల్పించడంలో మీ సహకారాన్ని కోరుతున్నాం.