అమరావతి నుంచి ఏదో విధంగా రాజధానిలోని పలుకార్యాలయాలను అటూ కర్నూలుకు, ఇటు విశాఖకు తరలించాలనుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు అడ్డు కట్ట వేసింది.
కర్నూలుకు కార్యాలయాలు తరలించేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జివోను హైకోర్టు ధర్మాసనం సస్పెండ్ చేసింది.
ఇటీవల ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా విశాఖలో ఎగ్జిక్వూటివ్ క్యాపిటల్, కర్నూలులో జుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది.
ఇందులో భాగంగా కోర్టు సంబంధిత, న్యాయపరమైన అన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్ కమిషన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ తరలించాలని నిర్ణయించింది. దీని కోసం జీవో 13ను ప్రభుత్వం విడుదల చేసింది ప్రభుత్వం.
అయితే రాజధాని పరిరక్షణ సమితి ఈ జివోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం ఈ కేసుపై కోర్టు తీర్పును వెలువరిస్తూ జీవో 13ను అమలు చేయరాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే స్థలాభావం కారణంగా అమరావతి నుంచి తరలిస్తున్నామన్న ప్రభుత్వ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది.