తెలుగు దేశం అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. విజయసాయిరెడ్డి ఎపుడూ చంద్రబాబు మీద దాడులను ట్విటర్ నుంచి ప్రారంభిస్తారు. ఈ సారి ఆయన రెండు రోజు లకిందట వివాదంగా ముగిసిన చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన మీద దాడి జరిపారు. విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని పినగాడి గ్రామరైతులను చంద్రబాబుపరామర్శించాలనుకున్నారు. ఈ రైతుల భూములను ప్రభుత్వ భూములని చెప్పి, యాభై సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్నామని చెప్పినా వినకుండా లాక్కున్నారు. ముఖ్యమమంత్రి జగన్ పిలుపు మేరకు అధికారులు ఎక్కడెక్కడి భూములను సేకరిస్తున్నారు.
చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర పేరుతో ఈ రైతులను ఓదార్చానుకున్నారు. ఈ చయాత్ర సంబర్భంగా సందర్భంగా చేసిన వ్యాఖ్యలను విజయ సాయి రెడ్డి ట్విట్టర్ లో ఖండించారు.
‘వైద్య శాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేని ఫోబియా తండ్రీ, కొడుకులకు పట్టుకుంది. ‘పులివెందుల ఫోబియా’ ఒకటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తక్షణం నోటిఫై చేయాలి. లేకపోతే ఎక్కడ ఇద్దరు వాదులాడుకున్నా అందులో ఒకరు పులివెందుల నుంచి వచ్చాడని వణికి చచ్చేట్టున్నారు!’ అని విజయ సాయి వ్యాఖ్యానించారు.
వైద్య శాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేని ఫోబియా తండ్రీ, కొడుకులకు పట్టుకుంది. ‘పులివెందుల ఫోబియా’ ఒకటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తక్షణం నోటిఫై చేయాలి. లేకపోతే ఎక్కడ ఇద్దరు వాదులాడుకున్నా అందులో ఒకరు పులివెందుల నుంచి వచ్చాడని వణికి చచ్చేట్టున్నారు!
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 29, 2020
‘ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత చులకన భావమెందుకు చంద్రబాబూ? ఒక వైపు అమరావతి నుంచి రాజధాని తరలించ వద్దని ఉత్తుత్తి ఉద్యమాలు నడిపిస్తావు. మళ్లీ ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తావు. వారి ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటే ఇలాంటి శాస్తే జరుగుతుంది’ అంటూ మండిపడ్డారు. ‘ప్రజలు ఉమ్మేస్తారన్న సిగ్గు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు చంద్రబాబూ. నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రను పరిపాలనా రాజధాని చేయాలని సిఎం జగన్ గారు నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ బస్సు యాత్రకు బయలుదేరతావా? అమరావతి కోసం ఉత్తరాంధ్ర ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా?’ అని ప్రశ్నించారు
ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత చులకన భావమెందుకు చంద్రబాబూ? ఒక వైపు అమరావతి నుంచి రాజధాని తరలించ వద్దని ఉత్తుత్తి ఉద్యమాలు నడిపిస్తావు. మళ్లీ ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తావు. వారి ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటే ఇలాంటి శాస్తే జరుగుతుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 29, 2020
విమానాశ్రయంలో తనని దిగ్భందించేందుకు కారణం పులివెందుల నుంచి వైఎస్సార్ సీపీ వచ్చినవారే కారణమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యానించారు. ఇదే ఈ ట్విట్టర్ దాడికి కారణం.
నోరు తెరిస్తే 14 ఏళ్లు సిఎంగా చేశా, ఆయన మాజీ హోంమంత్రి. తన దగ్గరే మీరు పనిచేశారు. మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ పోలీసు ఆఫీసర్లపై చిందులేయడం మీ మానసిక దౌర్భల్యాన్ని బయట పెడుతోంది. మీరు జీతాలిచ్చే హెరిటేజ్ స్టాఫ్ కూడా మాటలు పడరు? అలాంటిది పోలీసు అధికారులకు వార్నింగులివ్వడమేంటి?
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 29, 2020
ప్రజలు ఉమ్మేస్తారన్న సిగ్గు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు చంద్రబాబూ. నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రను పరిపాలనా రాజధాని చేయాలని సిఎం జగన్ గారు నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ బస్సు యాత్రకు బయలుదేరతావా? అమరావతి కోసం ఉత్తరాంధ్ర ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 28, 2020