ఆంధ్రలో ఆసక్తి కరమయిన చర్చ…రాజధాని తరలింపు ఆర్డినెన్స్ వస్తుందా?

ఆంధ్రప్రదేశ్  శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ (వాయిదా) చేస్తూ ఉత్తుర్వులు వెలువడ్డాయి. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు.
దీనితో రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మొదలయింది.నిజానికి ప్రొరోగ్ చేయడం సర్వసాధారణం. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ప్రొరోగో చేయక తప్పదు.  ప్రొరోగ్ చేసినపుడు మళ్లీ సమావేశం జరపాలంటే  గవర్నర్ సమన్లు (నోటిఫికేషన్)జారీచేయాలి. అలాకాకుండా ప్రొరోగ్ చేయకపోతే, సమావేశాలు తాత్కాలికంగా విరామంలో ఉన్నాయని అర్థం. అపుడు ప్రభుత్వం అనుకుంటే స్పీకర్ నోటిఫికేషన్ అసెంబ్లీని సమావేశపర్చవచ్చు
ఇపుడు వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులలను శాసన మండలి సెలెక్ట్ కమిటీకి నివేదించిడంతో రాజధాని తరలింపులోవిషయం తాత్కాలిక ప్రతిష్టంభన ఏర్పడింది. సెలెక్ట్ కమిటీ ఏర్పాటే వివాదంలో చిక్కుకుంది. కమిటీని అధికారపక్షం గుర్తించడం లేదు. అందువల్ల సభలు ప్రొరోగ్ చేయడంతో ప్రభుత్వం ఈ రెండు బిల్లలు ప్రతష్టంభన అధిగమించేందుకు ఒక ఆర్డినెన్స్ తీసుకువస్తుందని చెబుతున్నారు.
ఉగాది లోపు రాజధానిని విశాఖ తరలించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నందున  ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రోరోగ్ ఉత్తర్వులతో వైసీపీ ప్రభుత్వానికి ఈ అవవకాశం వచ్చిందనే పాలక పార్టీలో చాలా మంది చర్చించుకుంటున్నారు.
బిల్లులు శాసనమండలి ముందున్న సమయంలో సభలను ప్రోరోగ్ చేయడం వల్ల ఆర్డినెన్స్ జారీకి ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు ఉండవని వారు భావిస్తున్నారు.
అయితే, రాజధానిని తరలించవద్దని కోర్టు చేసిన సూచనల సంగతేమిటి?