ప్రైవేటు రైళ్లు నడిపేందుకు పోటాపోటీ

ప్రయివేటు రైళ్లను నడిపేందుకు ఈ బడ్జెట్ లో ఆర్థిక మంత్రి పచ్చ జండా ఊపడంతో అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు కాంట్రాక్టులు దక్కించుకునేందుకు పరుగు పెడుతున్నాయ్.
ప్రయోగాత్మకంగా ప్రయివేటు రైలు తేజస్ ఎక్స్ ప్రెస్ విజయవంతం కావడంతో రైల్వే శాఖ మరొక వందరూట్లను ప్రయివేటువాళ్ల కోసం కేటాయించింది.
దీనితో అంతర్జాతీయ కంపెనీలయిన ఆల్స్ స్టామ్ ట్రాన్స్ పోర్ట్,బొంబార్డియర్, సీమెన్స్ ఎజి, హ్యుదాయ్ రోటెం కంపెనీ, మకారీలు రైళ్లు నడిపేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
ఇంకా, దేశీయంగా టాటా రియల్టీ, అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ ఇ జడ్, ఎస్సెల్ గ్రూప్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం (ఐఆర్ సిటిసి)లు ముందుకు వస్తున్నాయి.
ప్రభుత్వం ప్రకటించిన నూరు రూట్లలో కనీసం 150 రైళ్లు నడపాలని రైల్వేశాఖ భావిస్తూ ఉంది.
ఈ రూట్లను 12 కారిడార్లుగా విభజించారు. ఇంందులో ముంబై-న్యూఢిల్లీ, చెన్నై-న్యూఢిల్లీ ,న్యూఢిల్లీ-హౌరా, షాలిమార్ -పుణే, న్యూఢిల్టీ-పాట్నాలు ప్రముఖమయినవి.
ప్రయివేటు రైళ్లలో కనసం పదహారు బోగీలుండాలి. అయితే, ఆ రూట్ లో తిరిగి పొడవాటి ప్యాసెంబర్ రైలు కుమించి బోగీలుండరాదు. ప్రయివేటురైళ్ల స్పీడు 160 కిమీ. మించరాదు.
ప్రయివేటు రైలు బయలుదేరిన తర్వాత 15 నిమిషాలవరకు మరొక రైలు నడపరాదు. టికెట్ ధరలు మాత్రం ప్రయివేటు కంపెనీలు నిర్ణయించుకోవచ్చు.