రేపు మండలి రద్దుపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని పురపాలక మంత్రి బోత్సాసత్యనారాయణ వెల్లడించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్న సభలను రద్దు చెయ్యాలనే ప్రభుత్వం నిర్ణయంతో ఉంది. రాజ్యాంగ బద్ధంగా చట్టసభల్లో చర్చ లేనప్పుడు వాటి అవసరం ఉందా అని ఆయన ప్రశ్నించారు.ప్రజా తీర్పు,రాజ్యాంగ బద్ధంగా నిర్ణయం తీసుకుంటాం? రేపటి వరకు ఎదురు చూడండి రిజల్ట్ ఎంటో తెలుస్తోందని ఆయన మీడియా కు చెప్పారు.
బోత్సా ఇంకా ఏమన్నారంటే…
శాసనమండలి అవసరం ఉందా లేదా అని రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ అడిగారు. మండలి రద్దుకు సంబంధించి రాష్ట్ర ప్రజలు మేధావులు వారి అభిప్రాయాలను చెప్తున్నారు. చట్టాలను చేసి అమలు చేసే శాసనసభా నిర్ణయాన్ని మండలిలో రాజకీయాల కోసం తిరష్కరిస్తారా? శాసనమండలిలో జరుగుతున్న పరిణామాలపై రాజకీయాలకు కోసం అనుకూలంగా మార్చుకుంటున్నారా.
1983లో టీడీపీకి బలం లేదని కౌన్సిల్ రద్దు చేసిన విషయం మర్చిపోయారా? ముఖ్యమంత్రిగా రామారావు కౌన్సిల్ రద్దు చేసిన విషయం గుర్తు లేదా? 13 జిల్లాల అభివృద్ధి కొసం శాసనసభల చట్టం చేసి ఆమోదిస్తే కౌన్సిల్ లో రూల్స్ కు వ్యతిరేకంగా సెలెక్ట్ కమిటీకి పంపుతారా?
ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టాల్సిన అవసరం వైసీపీ కి లేదు.చంద్రబాబుకు కొమ్ముకాసేలా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ఎమ్మెల్సీలను మేము ప్రలోభాలకు గురి చేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు.హైదరాబాద్ నుంచి విజయవాడ ఎందుకు వచ్చామో రాష్ట్ర ప్రజలకు తెలుసు.
రాజకీయాల కోసం రామోజీరావు ఈనాడు పత్రిక నడుపుతున్నారా?టీడీపీ ఎమ్మెల్సీలను మేము బెదిరింపులు గురి చెయ్యాల్సిన అవసరం లేదు. ఏ టీడీపీ ఎమ్మెల్సీని బెదిరింఛామో యనమల తక్షణమే సమాధానం చెప్పాలి. కొడుకు లోకేష్ కోసమే మండలిని రద్దు చెయ్యకుండా చంద్రబాబు పావులు కదుపుతున్నారు.
మండలి చైర్మన్ రోజుకొక మాట మాట్లాడుతూన్నారు.మండలి చైర్మన్ రాజకీయాల కోసం పని చేస్తారా? చంద్రబాబు కనుసన్నల్లోనే మండలి చైర్మన్ నడుస్తున్నారు. పెద్దల సభ రాజకీయ సభలా ఉంది.