ఈ మునిసిపల్ ఎన్నిలకల్లో పెద్ద విచిత్రం బైంసా మునిసిపాలిటి

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో స్థానం లో ప్రతిపక్ష హోదాను పదిలపర్చుకుంది.పార్టీకి తగ్గట్టే ఫలితాలొచ్చాయి. మొత్తంగా 508 వార్డులను గెల్చుకున్నామాజీ పిసిసి ప్రెశిడెంట్ ఉత్తమ్  కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెశిడెంట్ రేవంత్ రెడ్డి ఇలాకాల్లోనే చతికిల బడింది.  మొత్తం2727 వార్డులు డివిజన్లకు జరిగిన ఎన్నికలల్లో  టిఆర్ ఎస్ వార్డులు,  దాదాపు 1600 గెల్చుకుంది. 120 మునిసిపాలిటీలలో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలబిడింది.  కాని   బిజెపి పరిస్థితిమెరుగుపర్చుకుని మూడో స్థానంలోకి వచ్చింది. మూడో   స్థానమే అయినా అది బిజెపికి హర్షదాయకమే. ఎందుకంటే కార్పొరేషన్లో బిజెపి బలపడింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ   40 డివిజన్లను గెల్చుకుంటే బిజెపి 65 డివిజన్లను గెల్చుకుంది.బండ్లగూడ జాగీర్, రామగుండం,బోడుప్పల్, పీర్జాది గూడ, జవహర్ నగర్ మునిసిపాలిటీలలో బిజెపి  రెండో స్థానంలో నిలబడింది.
ఇంక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఆదీనంలో నల్లొండ (పిసిసి ప్రెశిడెంట్, ఎంపి ఉత్తమ్ ),  మల్కాజ్ గిరి (పిసిసి వర్కింగ్ ప్రెశిడెంట్, ఎంపి  ఎంపి రేవంత్ రెడ్డి)లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేదు. కాకపోతే, భవనగిరి లోక్ సభ నియోజకవర్గం (ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి) ప్రాంతంలో మునిసిపాలిటీలలో కాంగ్రెస్ నిలబడింది. 2014 లో కాంగ్రెస్ చేతిలో 14 మునిసిపాలిటీలుండేవి.
ఇపుడు ముగిసిని ఎన్నికల్లో 90శాతం మునిసిపాలిటీలను, 80శాతం కార్పరేషన్లను గెల్చుకుంది. ఇపుడు 120మునిసిపాలిటీలకు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి.  ఎన్ని విమర్శలొచ్చినా, ప్రతికూల వాతావరణం కనిపించినా, ఓట్లు వచ్చే సరికి ప్రజలు టిఆర్ ఎస్ కే పట్టం కడుగుతున్నారు. అందుకే మునిసిపల్ ఎన్నికల్లో  టిఆర్ ఎస్ అఖండ విజయం సాధించింది. ఎన్నికల్లో భీమ్ గల్ మునిసిపాలిటి ఒక విచిత్రం. నిజామాబాద్ కుచెందిన ఈ మునిసిపాలిటీలో సీట్లన్నీ టిఆర్ ఎస్ కే వచ్చాయి. ప్రతిపక్షం నుంచి ఒక్కరూ కూడా గెలవలేదు.భైంసా మరొక విచిత్రం. ఎందుకంటే, ఇక్కడ 26 వార్డులంటే ఎంఐఎం 15 గెల్చుకుంది. బిజెపి ఆరు గెల్చుకుంది. మిగతా ఇద్దరు ఇండిపెండెంట్లు. తెలంగాణ మొత్తం వీచిని పింకు గాలి ఇక్కడ కనిపించలేదు. టిఆర్ ఎస్ తరఫున ఒక్కరు కూడా గెలవలేదు. బహుశా ఎంఐఎం , టిఆర్ ఎస్ మధ్య ఇలా ఒప్పందమేమయినా ఉందేమో. ఈ ట్రెండు చూశాకే, అసదుద్దీన్ ఒవైసీ, బిజెపిని అడ్డుకునే శక్తి ఒక్కటిఆర్ ఎస్ కే ఉందని ప్రకటించారు. టిఆర్ ఎస్ కూడా తెలివిగా, అక్కడ బిజెపిధీటుగా ఉండాల్సింది పింక్ పార్టీ కాదు, ఎంఐఎం అని భావించినట్లుంది.అక్కడ  బిజెపి, ఎంఐఎంల మధ్య ముఖాముఖి పోటీ జరిగింది. కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదు.
అయితే, బిజెపి మొల్లిగా పుంజుకుంటూ  240 వార్డులను డివిజన్లను గెల్చుకుంది. మూడు మునిసిపాలిటీలను గెల్చుకుంది. అవి ఆమంగల్, తుక్కుగూడ. 2014లో బిజెపి గెల్చుకున్న వార్డులు డివిజన్లు కలిపి 167 స్థానాలే.
మొత్తంగా టిఆర్ ఎస్ం 109 మునిసిపాలిటీలను గెల్చుకుంటే, కాంగ్రెస్ ఆరు, బిజెపిమూడు గెల్చుకున్నాయి. ఎంఐఎం (భైంసా, జాల్ పల్లి) రెండింటిని గెల్చుకుంది.