పల్లెను బతికించిన సామాన్యుడికి ఈ ఏడాది ‘పద్మశ్రీ’

పద్మఅవార్డుల చాలా చాలా గొప్పవాళ్లకు వస్తుంటాయి.వాళ్లలో మహాపండితులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, సంగీతవేత్తలు, కవులు కళాకారులు, మహానటులు,పారిశ్రామిక వేత్తలు, దౌత్య వేత్తలుంటారు. వాళ్ల పక్కన  పల్లెటూరి రైతుకు చోటు దక్కడం కష్టం.  సామాన్యులు ఈ జాబితాలోకనిపించడం చాలా  అరుదు. కారణం ప్రపంచం కంట పడటానికి రైతుల దగ్గిరేముంటాయి. అయితే, అపడుపుడు అనుకోకుండా జీవన సమరాన్నికూడా గుర్తించి విజేతలకు ఈ అవార్డులందించడం జరగుతూఉంటుంది. ఈసారి ఒక పల్లెను బతికించిన సర్పంచుకు ఈ సారి పద్మశ్రీ పురస్కారం లభించింది.
ఎపుడు కరువు కాటకాలతో ఉన్న ఆ వూరి సర్పంచు పదవి తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు.అపుడు నువ్వే చదువుకున్నోడివని, వూరి ప్రజలంతా ఆయన్ని సర్పంచును చేశారు.

Like this story? Share it with a friend

అంతే, ఆయన కరువు కాటకాల ఆ పల్లెకొంపని పచ్చటి పల్లెసీమగా మార్చాడు. ఈ విప్లవాన్ని ప్రధాని నరేంద్రమోదీ కూడా  ప్రశంసించకుండా ఉండలేక పోయారు. 2016 మన్ కి బాత్ లో ఆయన ఈ సర్పంచు కృషిని ప్రశంసించారు. ఈ ఏడాది ఆయనకు పద్మశ్మీ అవార్డు లభించింది.
 ఈ వూరు పేరు హివారే బజార్,సర్పంచు పేరు పోపత్ రావ్ పవార్ .ఆయన సైన్స్ లో పోస్టు గ్రాజుయేట్. ఇపుడు వయసు 60 సం.
ఆయన 1989లో సర్పంచుగా ఎన్నికయ్యాడు.అపుడు మొదలయిన ఆయన సంస్కరణలు ఇప్పటికే కొనసాగుతున్నాయి.  ఆయన ఇపుడు హివారే బజార్ వంటి వంద గ్రామాలను సృష్టించే రాష్ట్ర ప్రభుత్వ పథకానికి ఏకంగా ఛెయిర్మన్ అయ్యారు.
1989లో ఆయన సర్పంచు అయ్యేనాటికి అహ్మద్ నగర్ జిల్లాలోని  హివారే గ్రామంలో ఎపుడు కరువువాతన పడుతూ ఉండేది.. వూర్లో నీళ్లుండేవికాదు. వూరి ప్రజలకు తాగుడు బాగా అలవాటుంది. బహిరంగ మల విసర్జన… ఇలాంటి అవలక్షణాలలో అదొక సగుటు భారతీయ గ్రామం.
ఇపుడు అదే హివారే బజార్ కు ఇపుడు నీళ్ల సమస్యలేదు. ఎపుడూ పచ్చగా ఉంటుంది. ఆవూరి తలసరి ఆదాయం ముప్ఫై ఎనిమిదింతలు పెరిగింది. ఊరి ప్రజలంతా మద్యాన్ని, ధూమపానాన్ని తరిమేశారు. వూరికి పశుగ్రాసం కొరత తీరింది. వూర్లో ఇపుడు పేదరికం లేదు. అధికారికంగా పేదరికం (బిపిఎల్ కుటుంబాలు)లేని గ్రామంగా హివారే బజార్ ను ప్రకటించారు.గత ముప్పై సంవత్సరాలలో ఈ గ్రామంలో 60 మంది కోటీ శ్వరులు తయారయ్యారు. 1995లో ఈ గ్రామంలో తలసరి ఆదాయం రు.830 మాత్రమే. ఇపుడు ఇది రు.30వేలకు పెరిగింది.
ఇదంతా ఎలా సాధ్యమయింది…
భారతదేశం  చాలా పెద్ద దేశం దీన్ని బాగు చేయడం చాలా కష్టం. సౌత్ కొరియా, డెన్మార్క్, సింగపూర్, నార్వే, తైవాన్ వంటి దేశాల ప్రగతి గురించి చెప్పినపుడు, అవన్నీ చాలా చిన్నదేశాలని, వాటికథ వేరు, భారత్ సంగతి వేరు అని  చాలా మంది ఇలా వాదిస్తుంటారు.
ఏవూరికావూరును కలసి డెవెలప్ చేసుకుంటే ఎవరొద్దంటారు. దీనిని  పవార్ రుజువు చేశాడు. మొదట్లో  వూరు బాగు చేసుకుందామని చెబితే ఎవరూ ముందుకు రాలేదు. ఆయన కూడా మొదట్లో అపజయాలు, సహాయనిరాకరణ ఎదుర్కొన్నారు. అన్ని రకాల మాటలు పడ్డారు. కాకపోతే, వాటిని ఖాతరు చేయకుండా ముందుకు పోయారు. మొదట చేపట్టిన కార్యక్రమం జలవనరుల సంరక్షణ. ఇది విజయవంతంకావడంతో వూరు స్వరూపం మారిపోయింది. వూరి ప్రజలంతా ఆయన దారికొచ్చారు.
తన విజయరహస్యం సామూహిక పరిపాలన (Community Governance)లని పవార్ చెబుతారు. ప్రణాళికలు ఢిల్లీలో తయారవుతాయి. వాటిని ప్రభుత్వ శాఖలు గ్రామాల్లో అమలు చేస్తాయి. వీటిలో గ్రామ ప్రజల ప్రమేయం ఉండదు. అందుకే మేం కమ్యూనిటీ గవర్నెన్స్ మార్గానికి వచ్చాం. హివారే బజార్ ది సమిష్టి గ్రామపాలన అని ఆయన అంటున్నారు.
జలసంరక్షణ కోసం ఆయన వూరి చుట్టు ఉన్న కొండల దగ్గిర 40 వేల కందకాలు తవ్వించారు. దీనితో కొండల మీద నుంచి కిందికి పారే వర్షపు నీరంతా నిలిచి భూమిలోకి ఇంకి భూగర్భ జలాలను పెంచింది.
అదే సమయంలో వూరి చుట్టూ చెట్ల పెంపకం మొదలుపెట్టారు. నాలుగున్నర లక్షల చెట్లునాటారు. దీనితో ఈ ప్రాంతంలో గడ్డి, పశుగ్రాసం బాగా పెరిగింది. గ్రామానికి పంచవర్ష ప్రణాలిక రూపొందించాడు. వూర్లో ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంచాడు. డెయిరీ ఇండస్ట్రీ బలపడింది. వూరి పాలఉత్పత్తి రోజుకు 6వేల లీటర్లకు పెరిగింది. వర్షాలు పడకపోతే,సమిష్టి గా ఏపంటవేయాలో నిర్ణయిస్తారు. నీటి అవసరం పెద్దగా లేని పంటలు వేస్తారు.నీళ్లని విపరీతంగా పీల్చే చెరకు పంట తమ గ్రామానికి పనికిరాదని మానేసి కూరగాయలు, పళ్లు,పూల వ్యవసాాయానికి మళ్లారు. దీనితో వూరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది.
ఆయన తీసుకువచ్చిన మార్పులతో హివారే బజార్ 1992లోనే బహిరంగ మలవిసర్జన లేని  గ్రామం (ODF) అయింది. ఆ వూర్లో వివాహానికి ముందు హెచ్ ఐవి పరీక్షలు తప్పని సరి చేశారు.
దేశంలో వాటర్ బడ్జెట్ రూపొందించుకునే గ్రామం హివారే  బజార్ ఒక్కటే. పవార్ నేతృత్వంలో ఈ గ్రామప్రజలుంతా ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 న సమావేశం అవుతారు.వూర్లో ఎంత నీరు అందుబాటులో ఉందో అంచనా వేస్తారు. దానిని బట్టి ఏ పంటవేయాలో వేయరాదో నిర్ణయిస్తారు. అవసరమయితే క్రాప్ హాలిడే ప్రకటిస్తారు. ఇలా చేసినా వాళ్ల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో పడవు. ఎందుకంటే, వూరిలో పాడిపరిశ్రమ బాగా బలపడింది.  రోజూ పాల నాలున్నర వేల లీటర్ల తక్కువ  కాకుండా పాలు ఉత్పత్తవుతాయని, ఈకుటుంబాల ఆదాయం 38 శాతం  పెరిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.