అమరావతి భూముల కొనుగోళ్ల మీద సీఐడీ కేసులునమోదు చేసింది. అమరావతిప్రాంతంలో భూముల కొనుగోళ్ల లో జరిగిన మోసాాలు, అవకతవకల ద సిఐడి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇద్దరు తెలుగుదేశం మాజీ మంత్రులు పత్తి పాటి పుల్లారావు (వ్యవసాయం), నారాయణ (మునిసిపల్) మీద సిఐడి కేసులు నమోదు చేసింది. ఇదే విధంగా 796 తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్పై కేసులు నమోదయ్యాయి. తమాషా ఏమిటంటే, ఈ తెల్ల రేషన్ కార్డులున్న వాళ్లు అక్కడ భారీ భూములు కొనుగోలు చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ రోజు వచ్చిన ఒక కథనం ప్రకారం అమరావతి ప్రాంతంలో 761 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. వీరంతా గుంటూరు వాస్తవ్యులు, ఇందులో 529 మందికి ప్యాన్ కార్డులు కూడా లేవు.
అమరావతి ప్రాంతంలో అనుమానాస్పద భూమి క్రయ విక్రయాలు ఎక్కువగా తూళ్లూరు మండంలో జరిగాయి. ఇపుడు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఉద్యమం జరుగుతున్నది కూడా ఇక్కడే.ఇక్కడే టెంపొరరీ సెక్రెటేరియట్ హైకోర్టు వస్తున్నాయి.
టైమ్స్ కథనం ప్రకారం, ఈ తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలెవరికీ నెలసరి ఆదాయం రు. 5 వేలు కూడా లేదు. వీరంతా భారీగా భూములు కొన్నారు. వీటి విలువ దాదాపు రు. 220 కోట్ల దాక ఉంటుంది. వీరెలా భూములు కొన్నారు. వీరి వెనక ఉన్న పెద్ద మనుషులెవరు, వీరు ఇక్కడే భూములు ఎందుకు కొన్నారనే విషయాలమీద సిఐడి దర్యాప్తు చేస్తున్నది.
ఈ భూముల కొనుగోలు వ్యవహారం ఇన్ కమ్ ట్యాక్స్ , మనీలాండరింగ్ కోణం ఉందేమో చూడాలని సిఐడి ఈ శాఖలకు లేఖలు రాసింది.