(Jinka Nagaraju)
సినిమాల ప్రొడక్షన్ లో, విడుదలలో ఇండియా ప్రపంచంలో రారాజు. సినిమాకు సంబంధించి ఇండియా సూపర్ మార్కెట్. సినిమా అభిమానం హీరోలను దేవతల్లాగా పూజించే స్థాయికి పెరిగిన దేశం. హీరోయిన్కు గుడికట్టిన దేశం కూడా ఇదే. నచ్చిన హీరోలను ఎన్నికల్లో గెలిపించి నేతలను చేస్తున్న దేశం ఇండియా.
భారతదేశంలో మొత్తం 40 భాషల్లో 2000 సినిమాలు నిర్మాణమవుతున్నాయి. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 2017లో భారతదేశంలో 1986 చిత్రాలు నిర్మాణమయ్యాయి. ఈ సినిమాలను దాదాపు వేయి కోట్ల మంది చూశారు.
ఇంత వ్యవహారమున్నా రాబడికి సంబంధించి భారతదేశం చాలా వెనకబడి ఉంది. ఈ విషయంలో అమెరికా, కెనడా, చైనాల తర్వాతే ఇండియా. 2017లో భారతీయ సినిమా పరిశ్రమ మొత్తం వ్యాపారం1.76 బిలియన్ అమెరికన్ డాలర్లు. అదే యుఎస్, కెనడాలు కలసి 11.4 బిలియన్ డాలర్లు బిజినెస్ చేశాయి. అది భారతసినిమా వ్యాపారం కంటే ఆరు రెట్లు ఎక్కువ. ఆ దేశాలలో ప్రొడ్యూస్ అయిన సినిమాలెన్నో తెలుసా? కేవలం 718 సినిమాలు. అంటే భారత్ కంటే 62 శాతం తక్కువ. ఇక చైనా విషయానికి వస్తే 2016లో చైనా విడుదల చేసింది కేవలం 391 సినిమాలే. కాని బాక్సాఫీస్ రాబడి ఎంతంటే 6.6 బిలియన్ డాలర్లు.2017లో చైనా బాక్సాఫీస్ రాబడి 30.3 శాతం పెరిగి 8.6 బిలియన్ డాల్లకు చేరింది. ఇక భారతదేశానికి సంబంధించి 2017 నుంచి 2020 నాటికి బాక్సాఫీస్ రెవిన్యూ కేవలం 6 శాతం పెరిగి, 1.9 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.
అయితే, స్క్రీన్ డెన్సిటీలో మాత్రం ఇండియాలో పాతాళంలో ఉంది. స్క్రీన్ డెన్సిటీ అంటే ప్రతి పదిలక్షల (మిలియన్ ) మంది ప్రజలకు అందుబాటులో ఉన్న మూవీ స్క్రీన్ అనిఅర్థం. ఈ విషయంలో భారతదేశంలో ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉంది.
అదే అమెరికాలో 125 తెరలున్నాయి. ఇంగ్లండులో 60, చిన్న దేశంలో సౌత్ కొరియాలో 40 తెరలు, చైనా 26 తెరలున్నాయి. అమెరికా కు చెందిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ధియోటర్ వోనర్స్ లెక్కలప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 2018 జూలై నాటికి మొత్తంగా 40837 సినిమా తెరలున్నాయి. 110 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో 9,100 (అక్షరాల తొమ్మి దివేల నూరు) ధియోటర్ స్క్రీన్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో 2400 మల్టీ ప్లెక్స్ స్క్రీన్లయితే, 6700 సింగిల్ స్క్రీన్ ధియేటర్లవి.
మొత్తం సినిమా రాబడిలో 45 శాతం వాటా మల్టీప్లెక్స్ లదే. మల్టీప్లెక్స్ లలో ప్రముఖ కంపెనీలు పివిఆర్, ఐనాక్స్, కార్నివల్, సినిపోలిస్ లదే. మొత్తం మల్టి ప్లెక్స్ రెవిన్యూలో ఈ నాలుగు కంపెనీల వాట 70-73 శాతం దాకా ఉంటుంది. ఇటీవల విడుదలయియన డిలాయిట్ రిపోర్టు ప్రకారం 2019 ఆర్థిక సంవత్సరంలో రు.11,000 కోట్ల బిజినెస్ జరగాల్సి ఉంది. ఇందులో సగం ఈ నాలుగు మల్టిప్లెక్స్ నుంచే వస్తుందని ఈ నివేదిక చెప్పింది.
ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడే వారెందరో మీకు తెలుసా?
ఈకంపెనీలన్నింటిలో కూడా పివిఆర్ గత ఆరేళ్లుగా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఈ కంపెనీ ఇపుడు తమిళనాడుకు చెందిన ధియేటర్ చైన్ కంపెనీ ఎస్ పిఐ నికొనేసింది.దీనితో పివిఆర్ సంస్థ ప్రపచంలో ఏడవ పెద్ద ధియోటర్ ఆపరేటర్ అయింది. 2020 సంవత్సరాంతానికి పివిఆర్ చేతిలో1000 స్క్రీన్స్ ఉంటాయని చెబుతున్నారు. ఎస్ పిఐ కి దక్షిణభారత దేశంలో 10 నగరాలలో 76 స్క్రీన్స్ ఉన్నాయి.
(ఈ స్టోరీ నచ్చితే, మీ మిత్రులందరికి షేర్ చేయండి)
భారత దేశానికి సంబంధించి 55 శాతం స్క్రీన్లు దక్షిణాది రాష్ట్రాలలోనే ఉన్నాయి. మిగతాభారతదేశమంతా కలసి 45 శాతం స్క్రీన్ లున్నాయి. సినిమా పరిశ్రమ కష్టాల్లో పడేందుకు ధియోటర్లు తక్కువగా ఉండటమేకారణమని చెబుతారు. కనీసం 15వేల నుంచి 20 వేల దాకా స్క్రీన్లు ఉన్నపుడు కొంత పరిస్థితి మెరుగుపడుతుందని సినిమా వ్యాపార పండితులుచెబుతున్నారు.
స్క్రీన్ డెన్సిటీ పెరుగుదల భారతదేశంలో నత్తనడక నడుస్తూ ఉంది. ఇక్కడి ప్రభుత్వ విధానాలు స్ర్కీన్ డెన్సిటీ పెరిగేందుకు అనుకూలంగాలేవని చెబుతున్నారు. దానికి తోడు ఉన్న ధియోటర్లలో వసతులు ఏ మాత్రం బాగుండవు. సింగిల్ స్క్రీన్ దియోటర్ టెక్నాలజీ ఎపుడో డిజిటల్ కాలానికి ముందు తెచ్చింది. ఆరోజు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమయినందున సినిమా ధియెటర్లన్నీ 500 నుంచి 1000 సీటింగ్ కెపాసిటీ పెద్దగా నిర్మించారు. ఈ సినిమాహాల్లు నిండాలంటే కూడా చాలా కష్టం. దీనితో మెయింటెన్స్ కష్టమయిన చాలా ధియేటర్లు మూతపడ్డాయి.
మీ వూర్లోనే చాలా సినిమా పాత ధియోటర్లు వ్యాపారం మానేసి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలుగా మారిపోయిన వైనం మీకు తెలుసు.
ఒకపుడు హైదరాబాద్ పెద్ద ధియోటర్ కాంప్లెక్స్ లాగా ఉండింది. ఏ మూలకు వెళ్లినా ఒక ధియోటర్ కనిపించేది. శుక్రవారం నాడు హైదరాబాద్ మొత్తం సినిమా సందడితో కళకళలాడేది. ఇపుడా రోజుల మారినకాలంలో పాత ధియోటర్లను నడపడం కష్టమయిన వోనర్లు చాలా మంది వాటిని కూల్చేసి షాపింగ్ కాంపెక్లులు కట్టారు.
ఇలా అంతరించిన పోయిన సినిమా ధియోటర్లు గురించి పాత తరం వారు గొప్పగా నెమరేసుకుంటూ ఉంటారు. హైదరాబాద్ మూతపడిన దియోటర్లు జాబితా ఇది: సంగీత్, మహేశ్వరి, పరమేశ్వరి, ఫరీన్,షహీన్ ( తర్వాత ఇవే సూర్య అయ్యాయి), ప్యాలస్ ధియేటర్, రాయల్ ధియేటర్, జామ్రూద్, డ్రీమ్ ల్యాండ్,షామ్ ధియోటర్, దిల్షాద్,మనోహర్,శోభనా, స్కైలైన్ అండ్ స్టెర్లింగ్, లిబర్టీ, నటరాజ్, అజంతా, కల్పనా ( ఈ జాబితా అసంపూర్ణం)
సినిమా ధియోటర్లు ఆక్యుపెన్సీ ఇండియాలో చాలా బాగా ఉంటుందని, ఇది అమెరికాకంటే ఎక్కువని అందువల్ల చిన్న పట్టణాల ( 2టియర్, 3 టియర్ )లో స్క్రీన్లు పెరగాలని వారు చెబుతున్నారు. మెట్రోనగరాలు 1 టియర్ సిటీలు, వైజాగ్, విజయవాడ, వంటి నగరాలు 2 టియర్ సిటిలు, మిగతా పట్టణాలన్నీ 3 టియర్ వర్గంగా చెబుతారు.
చైనాలో సినిమా స్క్రీన్లు ఇటీవల బాగా పెరిగాయి. అక్కడ 10 వేల నుంచి 45 వేలకు ఒకేసారి వెల్లువలాగా స్క్రీన్ లు పెరిగటాయి. తక్కువపెట్టుబడి ( లోకాస్ట్) సినిమా హాల్స్ ను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహమీయాలి. ఇప్పటికి భారతదేశంలో 96వేల మందికి ఒక స్క్రీన్ ఉంది. అదే అమెరికాలో 7800 మందికే ఒక స్క్రీన్ ఉంది.
స్క్రీన్ ల సంఖ్య బాగా పెరగడంతో 2000-2017 మధ్య చైనా సినిమా ఇండస్ట్రీ రెవిన్యూ 130 మిలియన్ డాలర్ల నుంచి 46 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే 6500 శాతం పెరిగింది. సినిమా కు సంబంధించి చైనా స్వర్ణయుగంలోకి ప్రవేశించిందని డిలాయిట్ పేర్కొంది. 2020 పూర్తయ్యే నాటికి చైనా సినిమా వ్యాపారంలో అమెరికా ను మించిపోతుందని, అక్కడ ధియోటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని డిలాయిట్ చెప్పింది. మేడ్ ఇన్ చైనా నుంచి ఆదేశం ఇపుడు మేడ్ ఫర్ వరల్డ్ కు ఎదిగింది.
పాతరకం భారీ ధియోటర్లను మెమయింటైన్ చేయడం కష్టం కావడంతో ఇటీవల వస్తున్న ధియోటర్లలో సీట్ల సంఖ్య బాగా తగ్గించారు. 250 సీట్లకు మించి ఉండటంలేదు. 1980 దశాబ్దం దాకా సింగిల్ స్క్రీన్ ధియోటర్లదే రాజ్యం. 1980 మధ్య నుంచి మల్టిప్లెక్స్ లు రావడం మొదలయింది. మల్లి ప్లెక్సులు పెరుగుతున్నా,చాలా సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మాయం కావడంతో ఇండియాలో స్క్రీన్ సంఖ్య 3 శాతం తగ్గింది. 2009 నుంచి ప్రతి సంవత్సరంత 5 నుంచి 10 శాతం సింగిల్ స్క్రీన్ ధియోటర్లు మూతపడుతున్నాయి.
రాష్ట్రాలలో స్క్రీన్ డెన్సిటీ
రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ టాన్. ఇక్కడ ఆరుకోట్ల జనాభాకు 28.1 స్క్రీన్లున్నాయి. రెండో స్థానం కేరళది. అక్కడ జనాభా 3.3 కోట్లు . స్క్రన్ డెన్సిటీ మాత్రం 14.6. తర్వాతి మూడో స్థానం 13.3 స్క్రీన్లతో కర్నాటకది. ఇక నాలుగొ స్థానంలో ఉన్న తమిళనాడులో స్క్రీన్ డెన్సిటీ 12.6. తెలంగాణ (జనాభా 3.5 కోట్లు 2011 సెన్సస్)లో స్క్రీన్ డెన్సిటీ 6.2 మాత్రమే. ఇతర రాష్ట్రాలకు సంబంధించి స్క్రీన్ డెన్సిటీ ఉత్తర ప్రదేశ్ 2.6, మహారాష్ట్ర 9.2, బీహార్ 2.7, పశ్చిమబెంగాల్ 4.8, మధ్య ప్రదేశ్ 4 , గుజరాత్ 11, ఒరిస్సా 3.7 జార్ఖండ్ 2.4, అస్సాం 2.5, పంజాబ్ 8, చత్తీష్గడ్ 4.9,హర్యానా 5.5, ఢిల్లీ 5.4, జమ్ము అండ్ కాశ్మీర్ 2.3 ఉత్తరాఖండ్ 7.2.
సింగిల్ స్క్రీన్ ధియోటర్లు మూతపడటంతో ఇండియాలో స్క్రీన్ ల సంఖ్య 9300 (2016) నుంచి 6000( 2016)కు పడిపోయింది. ఈ మధ్య కాలంలో మల్టిప్లెక్స్ స్క్రీన్ లు పెరిగినా, ఈ గ్యాప్ ను పూరించేంత వేగంగా వాటి పెరుగుదల లేదు. ఉన్న స్క్రీన్ లన్నింటిలో ఎక్కువ భాగం 25ప్రధాన నగరాలలోనే కేంద్రీకృమయిఉన్నాయి(2016). ప్రపంచంలో అత్యధిక స్క్రీన్ డెన్సిటీ (21) ఉన్న మహానగరం ముంబై, తర్వాతి స్థానం అమెరికాలోని ఆస్టిన్ (19.1) నగరానిది. 2015 లెక్కల ప్రకారం స్విజర్లాండ్ లోని జూరిక్ నగరం స్క్రీన్ డెన్సిటీ (15.1)
(If you like this story, share it with a friend)