ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడే వారెందరో మీకు తెలుసా?

(TTN Desk)
ప్రపంచ జనాభా 7.5 బిలియన్లు.ఇందులో ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య 20 శాతం అంటే  1.5 బిలియన్ ప్రజలు. అయితే, వీళ్లందరు ఇంగ్లీషోళ్లు కాదు.వాళ్లందరిదిఇంగ్లీష్ మాతృభాష కాదు. ఇందులో 360 మిలియన్ల మందికి ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజి.  ప్రపంచంలోని అన్ని దేశాలలో బాగా ప్రాధాన్యంతో చదువుకునే, నేర్చుకునే విదేశీ భాషఇంగ్లీష్. రెండో ది ఫ్రెంచ్ . అయితే, ఇది ఇంగ్లీష్ కంటే బాగా దూరాన ఉంటుంది.
అమెరికా ఖండాల్లో ఉత్తర అమెరికా, సెంట్రల్ అమెరికాలలో ఇంగ్లీష్ మాతృభాష ఎందరిది అనే దాని మీద భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే, ఈ మూడింటిలో  250  మిలియన్లు మందికి ఇంగ్లీష్ మాతృభాష. ఇందులో ఎక్కువ మంది, 231  మిలియన్లు, యునైటెడ్ స్టేట్స్ లో నే ఉన్నారు. కెనడాలో మరొక 19 మిలియన్ల మంది ఉన్నారు.
కరిబియన్ ఐలెండ్స్ లో కూడా ఇంగ్లీష అధికార భాష. ఇక దక్షిణ అమెరికాలో  8 లక్షల మంది మాత్రమే ఇంగ్లీష్ మాతృభాషలాగా మాట్లాడతారు.
టెలిగ్రాఫ్ రిపోర్టు ప్రకారం ప్రపంచంలోని 45 దేశాలలో సగానికంటే ఎక్కువ జనాభా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇందులో ఎక్కువ దేశాలుచాలా చిన్నవి.  ఇంగ్లీష్ మాట్లాడే వారు పదిశాతంలోపే ఉన్నదేశాలు 13 ఉన్నాయి. అందులో చైనా ఒకటి.
రష్యాలో  ఇంగ్లీష్ కు పెద్దగా గుర్తింపు లేదు.స్కూళ్లలో కాలేజీల్లో ఇంగ్లీష్ బోధించినా, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నది అక్కడ తప్పని సరి కాదు.యూరోప్ దేశాలలో ఇంగ్లీష్ భాష మాట్లాడే ప్రజల సంఖ్యలో  రష్యా అట్టడుగున ఉంటుంది. రష్యన్లు ఇంగ్లీష్ నేర్చుకునేందుకు తెగతంటాలు పడుతుంటారు. చాలా మందికి ఇంగ్లీష్ తో పని బడదు.ఆ భాష నేర్చుకోవడం ఒక తలనొప్పి అని ఫీలవుతుంటారు.
యూరోప్ లో … 
2006లో జరిగిన ఒక సర్వే ప్రకారం యూరోపియన్ యూనియన్ జనాభాలో కేవలం 13 శాతం  మంది మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడతారు. యూరోపియన్ యూనియన్ జనాభా  450 మిలియన్లు. ఇందులో నేటివ్ ఇంగ్లీష్ మాట్లాడే వారు  58 మిలియన్లు. మరొక 58 మిలియన్లు మంది తమకు ఇంగ్లీష్ తెలుసునని మాత్రం చెప్పారు. యూరోప్ ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడే దేశాలు మూడు. అవి ఇంగ్లండ్, ఐర్లండ్, మాల్టా. ఇంగ్లండు ఐర్లండులలో 90 శాతం మంది ఇంగ్లీష్ మాతృభాష. మాల్టాలో  62 శాతం మంది ఇంగ్లీష్ మాట్లాడతారు.
ఆఫ్రికాలో…
ఆఫ్రికాలో కరిబియన్ ద్వీపాల్లో లాగానే, బ్రిటిష్ పరిపాలన వల్ల చాలా ఆఫ్రికన్ దేశాల్లోకి కూడా ఇంగ్లీష్ బాగా చొరబడింది. ఆఫ్రికా మొత్తం జనాభా  1.2 బిలియన్లు. ఇందులో ఇంగ్లష్ తమ  మాతృభాషలాగా మాట్లాడే వారి సంఖ్య కేవలం 6.5 మిలియన్లే. ఇక మిగతావారిలో  700 మిలియన్ల మంది ఇంగ్లీష్ లో మాట్లాడగలరు. వరల్డ్ లింగ్విస్టిక్ సొసైటీ నివేదిక ప్రకారం ఆఫ్రికా అన్ని దేశాలలో కంటే ఉగాండా ప్రజలు  చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఆఫ్రికాలో 23 దేశాల్లో ఇంగ్లీష్ అధికార భాష. మరొక26 దేశాలలో ఫ్రెంచ్ అధికార భాష. 9 ఆఫ్రికా దేశాలలో ఇంగ్లీష్ ఎక్కువ మంది మాట్లాడతారు. అవి, ఉగాండా,జాంబియా, సౌతాఫ్రికా, కెన్యా,జింబాబ్వే, మలావి, ఘనా, బోట్స్వానా, సూడాన్.
ఇతర ఖండాలలలో పరిస్థితి…
ఆసియా లో ఇంగ్లీష్ వాళ్లు బాగా తక్కువ. అయితే, ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజీగా, లేదా ఒక ఫారిన్ లాంగ్వేజీగా చదివే వాళ్లు మాత్రం జాస్తి. ఆసియాలో ఇంగ్లీష్  మాట్లాడే వాళ్లు అత్యధికంగా ఉండేది భారత్ లోనే. ఇక్కడ125 మిలియన్ల మంది ఇంగ్లీష్ మాట్లాడతారు. తర్వాతి స్థానం 94 మిలియన్లతో పాకిస్తాన్ .  మూడో స్థానం ఫిలిప్పీన్స్ ది. అక్కడ 90 మిలియన్ల మంది ఇంగ్లీష్ మాట్లాడతారు.
ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్లలో మెజారిటీ ప్రజలు అంటే 70 శాతం దాకా నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్. న్యూజిలాండ్ లో కూడా  ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లు చాలా ఎక్కువ (3.8 ) మిలియన్లు. అయితే, వాళ్లు మాట్లాడేది న్యూజిలాండ్ ఇంగ్లీష్.
ఇంగ్లీష్ అధికార భాష గా ఉన్న దేశాలు:
బోట్స్వానా, కామెరూన్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా,ఫిజి, ఘనా, ఇండియా, కెన్యా, కిరి బాటి, లెసోతో, లైబీరియా, మాల్టా,  ది మార్షల్ ఐలండ్స్, మారిషస్,  నమీబియా, నైజీరియా, పాకిస్తాన్,పాలౌ,.పపువా న్యూ గినీ, ఫిలిప్పీన్స్, రువాండా, సెయింట్ లూషియా, శమోవా, సేషిలీస్, సియెరా లియాన్, సింగపూర్, సాలమన్ ఐలాండ్స్, శ్రీలంక, సూడాన్, దక్షిణాఫ్రికా, సౌత్ సైడాన్, స్వాజీలాండ్, టాంజానియా, ఉగాండా, జాంబియా, జింబాబ్వే.
ఇంగ్లీష్  మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఉన్న దేశాలు
బ్రిటిష్ గవర్నమెంట్ సమాచారం ప్రకారం  ఇంగ్లీష్ మాతృభాష కలిగిన ప్రజలు ఎక్కువగా ఉండే దేశాలేవంటే… యుకె, యుఎస్ ఎయాంటిగ్వా, బార్బుడా, ఆస్ట్రేలియా, బహామాస్, బార్బడోస్, బెలిజే, కెనడా, డొమినికా, గ్రెనెడా, గయానా, ఇర్లండ్, జమైకా, న్యూజిలాండ్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూషియా, సెయింట్ విన్సెంట్, ది గ్రెనెడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో.

(featured Photo source kolegji Universum)

Like this story? Share it with a friend!