మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతుల భారీ ర్యాలీ (వీడియో)

అమరావతిలో 19 రోజులు ’సేవ్ అమరావతి‘ ఉద్యమం నడుపుతున్న రైతులు ఈరోజు తుళ్లూరు నుంచి మందడం‌ వరకు‌ భారీ ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాల్గొన్న వేలాది మంది రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, మూడుముక్కలు చేయరాదని వారు నినాదాలు చేశారు.తుళ్లురు నుంచి మందడం వరకు  10కిలోమీటర్ల మేర  ర్యాలీ సాగింది. మహిళలు జాతీయ జండా పట్టుకుని  కవాతు చేశారు.  వ్యవసాయ జెండాలతో రైతుల భారీ పాదయాత్ర జరిపారు. బైక్ పై యువత, ట్రాక్టర్ల పై మహిళల ర్యాలీతో అమరావతి ఐక్య ప్రదర్శన లాగా ర్యాలీ జరిగింది. ఈర్యాలీయి  సంఘీభావం గా తెలుగుదేశం, భాజపా, కాంగ్రెస్, వామపక్షాల నేతలు, ప్రజాసంఘాలు కూడా రైతులతో కలిశాయి.

 

Like this story? Share it with a friend!