అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన సాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ వ్యాఖ్యానించారు. ఈ రోజు పౌరసత్వం చట్టానికి ప్రజల మద్దతు కోరుతూ ఏర్పాటుచేసిన ఒక సమావేశంలో ఆయన రాజధాని ప్రస్తావన తెస్తూ ఇలా వ్యాఖ్యానించారు.
రాజధాని మార్పు మీద ఏపీ ప్రభుత్వం వేస్తున్న కమిటీలు, వస్తున్న నివేదిక గురించి చర్చించక్కర్లేదని, జగన్ ప్రభుత్వం వేసిన కమిటీలు వారికే అనుకూలంగా నివేదికలు ఇస్తాయని, దీనిని ఇప్పటి వరకు వేసిన రెండుకమిటీల నివేదికలు రుజువుచేశాయని కన్నా వ్యాఖ్యానించారు.
క్యాపిటల్ వికేంద్రీకరణ మీద జిఎన్ రావు కమిటి, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ లు అధ్యయనం చేసి రాజధాని వికేంద్రీకరణను సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.
కాపిటల్ మార్చే అధికారం ఇప్పటి ప్రభుత్వానికి లేనే లేదని, రాష్ట్ర విభజన తర్వాత పొలిటకల్ కాన్సెన్సస్ అమరావతి రాజధాని నిర్ణయం జరిగిందని ఆయన అన్నారు.
అసెంబ్లీలో అన్నీ పార్టీలు అంగీకారంతోనే అమరావతి నిర్ణయం జరిగిందని గుర్తు చేస్తూ అమరావతి రాజధాని నిర్మాణం ప్రభుత్వ నిర్ణయం కాబట్టే… ప్రధాని నరేంద్రమో మోడీ స్వయంగా శంఖుస్ధాపనకు వచ్చారని ఆయన అన్నారు.
‘రాజధాని ఎక్కడ పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమే. దీని మీద గత ప్రభుత్వం రాజకీయ ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇక దానిని మార్చనవసరం లేదంటున్నాం,’ అని కన్నా అన్నారు.
రాజధాని ఏర్పాటు కేంద్రానికి సంబంధించిన విషయం కాదని, ఇందులో కేంద్రం జోక్యం చేసుకుంటుందని మేము చెప్పలేదని ఆయన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజధాని విషయంలో మా పార్టీలో బిన్నాభిప్రాయాలు లేవని కూడా అన్నారు.
‘రాష్ట్ర ప్రభుత్వం చేసే పిచ్చి పిచ్చి పనులన్నింటిలో లో కేంద్రం జోక్యం చేసుకోదు,’ అని అన్నారు.
చంద్రబాబు కూడా ‘అంతా నాదే,అన్నింటా నేనే’ అనే నియంత్రుత్వ ధోరణిలో ముందుకు వెళ్లారని, దీనిని పర్యవసానం ఏలా ఉంటుందో ఎన్నికల్లో చూశామఅని ఆయన అన్నారు.
రాజధాని మార్పు ఆపటానికి ప్రయత్నం చేస్తాం. అనేక ఫోరమ్స్ ఉన్నాయి, వాటిని కలుపుకుని పోతాం. రాజధాని లో సాగుతున్నది కేవలం రైతుల ఉద్యమం కాదు… రాజధాని ఉద్యమం. రాజధాని కోసం రోడ్డుమీదకు వచ్చిన మహిళలపై పోలీసులను ప్రయోగించాడాన్ని ఖండిస్తున్నం. ప్రభుత్వం రాక్షస పాలన చేస్తోంది,’ అని కన్నా లక్ష్మినారాయణ అన్నారు.