కబడ్దార్, సౌత్ ఇండియా మహిళల్లో డిప్రెషన్ పెరిగిపోతా ఉంది : భారీ సర్వే

భారత దేశంలో ప్రజల్లో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో  మానసిక రుగ్మత బాగా పెరిగి పోతూఉంది. 1990 నుంచి ఇలా మానసిక జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య 2017 నాటికి రెట్టింపయింది. అన్నింటికంటే ఆందోళన కరమయిన విషయం దక్షిణ భారతదేశంలో మహిళలు ఎక్కువగా మానసిక జబ్బులకు లేదా వత్తిళ్లకు బాగా లోనవుతున్నారు.
దేశంలో పెరిగిపోతున్న మానసిక జబ్బుల మీద మొట్టమొదటి సారి ఒక సమగ్ర సర్వే జరిగింది. సర్వే ఫలితాలు లాన్సెట్ సైకియాట్రీ (Lancet Pshychiatry) లో అచ్చయ్యాయి. ఈ సర్వే ప్రకారం భారతదేశంలో 2017లో ప్రతి ఏడుగురిలో ఏదో కొంత తీవ్రత మానసిన జబ్బు పీడిస్తూ ఉంది. ఇది ఆందోళన కరమయిన విషయమని నిపుణులు చెబుతున్నారు.
అనేక మంది శాస్త్రవేత్తలతో కూడిన India State-Level Disease Burden Initiative Mental Disorders Collaborators ఈ సర్వే నిర్వహించింది.
సర్వేకి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, ఐసిఎంఆర్, భారత ప్రభత్వం వైద్య ఆరోగ్య శాఖ అందించిన ఆర్థిక సాయంతో ఈసర్వే సాగింది.సర్వే ఫలితాలను లాన్సెట్ సైకియాట్రి  2019 డిసెంబర్ సంచికలో ప్రచురితమయ్యాయి. ఈ సర్వే  పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
భారతీయులను పీడిస్తున్నమానసిక జబ్బులో అన్నిరకాలున్నాయి: డిప్రెషన్, యాంగ్జైయిటీ డిసార్డర్,స్కీజో ఫ్రేనియా,బైపోలార్ డిసార్డర్, ఇడియోపాథిక్ డెవెలప్ మెంటల్ ఇంటలెక్చువల్ డిసెబలిటీ, కాండక్ట్ డిసార్డర్, అటిజం…వగైరా.
(ఈ వార్త ప్రయోజనకరమనిపిస్తే   మీ మిత్రులకు షేర్ చేయండి)
2017లో 19.7 కోట్ల మంది భారతీయులు ఈ రకం మానసిక జబ్బులతో బాధపడుతున్నారు. ఇందులో 4.6 కోట్ల మంది డిప్రెషన్ తో బాధపడ్డున్నారు. మరొక 4.5 కోట్ల మందిలో యాంగ్జీయిటీ డిసార్డర్స్ ఉన్నాయని ఈ సర్వే వెలల్డించింది.
ఈ రెండు రకాల జబ్బులే ఎక్కువగా బాధిస్తున్నాయని, ఇవి ఏయేటికాయేడు పెరుగుతున్నాయని ఈ అధ్యయనం చెప్పింది.మరొక ముఖ్యవిషయమేమిటంటే దక్షిణ భారత రాష్ట్రాలలో అందునా మహిళల్లో మిగతా రాష్ట్రాలకంటే ఎక్కువగా ఉందని ఈ సర్వేవెల్లడించింది.
డిప్రెషన్ కొద్దిగా వయసు పైబడినవారిలో మరీ ఎక్కవగా ఉందని, అంటే వయసుపైబడే కొద్ది ఈసమస్య తీవ్రమవుతూ ఉందని ఈ సర్వేలో వెల్లడయింది.
భారతదేంలో ప్రజల మీద ఉన్న మొత్తం జబ్బుల బర్డెన్ (Total desease burden) మానసిక జబ్బుల శాతం రెట్టింపయింది. దీనిని బట్టి దీనిని ఎదుర్కొనేందుకు సమర్థవంతమయిన వ్యవూహాలు అమలుచేయాల్సిన సమయమాసన్నమయిందని ఈ సర్వే సూచించింది.
విచిత్రమేమింటే దక్షిణ భారత దేశంలో పెద్దవారిలో మానసిక జబ్బులెక్కువగా కనబడితే, పిల్లలలో ఈజబ్బులు కనిపించడం ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని నివేదిక లో కనిపించింది.
పెద్ద వారిలో మానసిక జబ్బులు కనిపించడం ఆందోళన కరమయిన విషయమని, దీని మీద వెంటనే దృష్టిపెట్టాలని ఇండియా స్టేట్ -లెవెల్ డిసీజ్ బర్డెన్ ఇనిషియేటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ లిలిత్ దండోనా తెలిపారు.

(Photo source risingkashmir )