దిశ సంఘటన తర్వాత హైదరాబాద్ లోని పోలీస్ కమిషనర్లంతా నూరో నెంబర్ కు ఫోన్ చేయండి,మీకేదయినా సమస్య ఉంటే పోలీసులు నాలుగైదు నిమిషాన్లలో వాలతారని హామీ ఇచ్చారు.
100 ఫోన్ నెంబర్ ప్రజలకు అండ అని చెప్పారు. అయితే, నూరో నెంబర్ కు ఫోన్ చేస్తే ఈ కాన్ స్టేబుల్ కు కోపమొచ్చింది.నా నిద్ర చెడగొడుతున్నావని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఫోన్ చెసిన వ్యక్తి బయటకు వచ్చి, ఆయనను బయటకు రమ్మని, నా నిద్ర పాడుచేస్తావాని ఉతికేశాడు… అసలు జరిగిందేమంటే…
హైదరాబాద్ జీడిమెట్లలోని హెచ్.ఏ.ఎల్ కాలనీలో అల్లరిమూక గొడవ చేస్తున్నారని సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఒక యువకుడు డయల్ 100కి ఫోన్ చేశాడు.అయితే , ఒక కానిస్టేబుల్ డయల్ 100కి ఫోన్ చేసిన యువకుడికి ఫోన్ చేసి ఇంటి నుంచి బయటికి పిలిచాడు. ‘అర్ధరాత్రిపూట నా నిద్ర ఎందుకు చెడగొట్టావురా? ఎవరు కొట్టుకుని చస్తే నీకెందుకురా?’ అంటూ బూతుల దండకం ప్రారంభించారు. రెండు చెంపలు వాయించి, తిడుతూ జీపులో జీడిమెట్ల పీఎస్‌కు తరలించాడు. అక్కడ కాలనీలో పోలీసులకు ఫోన్ చేసిన యువకుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలతో కాలనీ మొత్తం గాలించారు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులతో మాట్లాడనీయకుండా కాన్ స్టేబుల్ కోటేశ్వరావు ఫోన్ లాక్కున్నాడు. అయితే, తాను స్టేషన్ కు తీసుకువచ్చిన వ్యక్తికి మీడియా ప్రతినిధి కానిస్టేబుల్ కోటేశ్వరరావు అతన్ని తిరిగి ఇంటి దగ్గిరకు తీసుకువచ్చి వదిలాడు.
అయితే, ఇదేమి అన్యాయం, డయల్ 100 కు ఫోన్ చేస్తే శిక్షిస్తారా అంటూ రాత్రే డీజీపీ, సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. డయల్ 100కి ఫోన్ చేస్తే.. ఇంటి నుంచి తీసుకెళ్లి మరీ ఎలా కొడతారాని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కాన్ స్టేబుల్ మీద చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హామీ ఇచ్చారు.