హైకోర్టు అమరావతిలోనే ఉండాలి: న్యాయవాదుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలని న్యాయవాదులు ఆందోళనకు దిగారు. అమరావతి హైకోర్టుకు అన్ని విధాల అనుకూలంగా ఉందని, ఇక్కడికి రైలు,విమాన సదుపాయం బాగా ఉందని, ఇక్కడి నుంచి న్యాయవాదులు ఇతర ప్రాంతాలకు వెళ్లడం సులువు అని న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ రోజు నుంచి 27 వరకు తాము విధులను బహిష్కరిస్తున్నామని, తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేసేవిషయం నిర్ణయిస్తామని లాయర్ల జెఎసి ప్రతినిధులు చెప్పారు.

రాజధానిని విశాఖకు తరలించి, అమరావతిని కేవలం లేజిస్లేటివ్ రాజధానిగా ఉంచాలని, హైకోర్టు ను కర్నూలు కు తరలించి జ్యడిషియల్ క్యాపిటల్ గా ప్రకటించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా జిఎన్ రావు నిపుణుల కమిటీ గా సిఫార్సు చేసింది.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంతరైతులు ఆందోళనకు దిగారు. ఇపుడు న్యాయవాదులు వారితో శ్రతి కలిపారు.