దళిత వెతలకు, వేదనకు అక్షర రూపమిచ్చి ‘ఔటాఫ్ కవరేజ్ ఏరియా’ అంటూ గొంతెత్తి చాటి, కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి యువ పురస్కారాన్ని అందుకున్న దళిత మేధావి అతడు.
‘వందేళ్ల ఉద్యమం పాట’కు పెట్టం కట్టిన వాడు. తెలంగాణ ఉద్యమానికి కలం, గళం అయ్యాడు. అతడే డాక్టర్ పసునూరి రవీందర్.
తన కథలు, కవితలు రాసుకుంటూనే, తనకంటే ముందు దళితుల తరఫున గొంతెత్తిన దళిత నాయకులను కూడా రికార్డ్ చేస్తున్నారు.
తెలంగాణ మట్టి పరిమళమైన పసునూరి ఈరోజు మరో రెండు పుస్తకాలను ఆవిష్కరిస్తున్నారు. సాహిత్య విమర్శ వ్యాసాలు ‘ఇమ్మతి’, పరిశోధన గ్రంథం ‘గ్లోబలైజేషన్ సాహిత్య విమర్శ’ పుస్తకాలు మరికొద్ది గంటల్లో మనముందుకు రాబోతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు