ఆంధ్ర ప్రదేశ్ రాజధాని రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. అమరావతి సైజు మీద కోత పెట్టి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చిన తర్వాత ఒక వైపు నిరసనలు మరొక వైపు సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు అమరావతిలో రైతులు నిరసన వ్యక్తం చేస్తే, నెల్లూరు ప్రజలు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 3 రాజధానుల ఏర్పాటు కు మద్దతు తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ మానవహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
గత ప్రభుత్వంలో బినామీల పేర్లతో అమరావతిని భ్రమరావతి అయింది. లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. అందుకే రాజధాని వల్ల ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదని 3 రాజధానులను ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి భాటలో నడవాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని మేం స్వాగతిస్తున్నామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
చెప్పిన వాగ్ధానాలన్నింటిని అమలు చేస్తూ ఒక మంచి రాజకీయనాయకుడిగా ఆలోచన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిబాటలో నడిపిస్తున్నారని, ప్రజలంతా దీనికి మద్దు తెలపాలని ఆయన కోరారు.