అమరావతి: రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన ఉల్లి ధరల పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వం మీద వ్యంగ్యాస్త్రంసంధించారు.
వైసీపీ ప్రభుత్వం.. ప్రజల నిత్యావసరాల విషయాలలో చాలా ఘోరంగా విఫలమైందని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
‘ఇందుకు కిలో ఉల్లి కోసం బారులు తీరిన ప్రజలే తార్కారణం.ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదంటారు. కానీ జగన్ రెడ్డి గారు చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదు. అందుకే ఉల్లి ఎందుకు.. అనవసరం.. అని దాని రేటు పెంచేశారని అన్నారు.
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు ,కానీ జగన్ రెడ్డి గారు చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదు, అందుకే ఇంకా ఉల్లి ఎందుకు సిల్లీగా , అని దాని రేటు పెంచేశారు
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2019