లండన్ సమీపంలోని ఇస్కాన్ (ISKCON)మందిరాన్ని బ్రిటిష్ ప్రధాని బొరిస్ జాన్సన్, హోంసెక్రెటరీ ప్రీతి పటేల్ ఆదివారంనాడు సందర్శించారు. ఈ మందిరాన్నిభక్తి వేదాంత మేనార్ అని పిలుస్తారు. ఇది ఇంగ్లండులో అతి పెద్ద ఇస్కాన్ మందిరం.
ఈ మందిరాన్ని ప్రఖ్యాత గాయకుడు జార్జి హారిసన్ నిర్మించుకున్నారు. తరువాత ఆయన దానిని ఇస్కాన్ కు అందించారు.
మందిరంలో ప్రధాాన దైవమయిన శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద (1 సెప్టెంబర్1896 – 14 నవంబర్ 1977) కు బ్రిటిష్ ప్రధాని పూలమాల వేశారు.ఇస్కాన్ (International Society for Krishna Consciousness) భక్తి ఉద్యమాన్నిప్రారంభించింది (1966) ప్రభుపాద స్వామియే.ఈ ఉద్యమాన్నిహరేక్రిష్ణ ఉద్యమం అని కూడా పిలుస్తారు.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/telugu/henri-ford-great-grandson-building-worlds-largest-hindu-temple-in-mayapur-west-bengal/