డబ్బు రాజకీయాల మీద రేపు కవిత లెక్చర్

రాజకీయాలంటే డబ్బు. డబ్బు పాత్ర విపరీతంగా పెరిగిపోయి ప్రజాస్వామ్యం ఎంత గబ్బు లేచిందో మనకు తెలుసు. ఎన్నికల్లో పార్టీ టికెట్ కావాలంటే డబ్బుం డాలి. ఓట్లు రావాలంటే డబ్బు పంచాలి. ఇక ఎన్నికల్లో గెల్చాక కిక్ బ్యాక్ , క్విడ్ ప్రో క్వో రాజకీయాలు.
డబ్బు పాత్ర తగ్గించి, రాజకీయాలను ప్రక్షాళన చేయాలని కొంతమంది మహానుభావులు కలలు కన్నారు. అది నెరవేరలేదు. అయితే ఆ ప్రయత్నాలు ఆగలేదు.
ఇపుడు ఈ సమస్య మీద యూనివర్సిటీ లు, మేధో సంస్థలు సభలు సమావేశాలు పెట్టి ఎన్నో సలహాలు ఇవ్వడం జరుగుతూన్నది. ఇలాంటి సమావేశం ఒకటి రేపు, మర్నాడు హైదరాబాద్ లో జరుగుతున్నది.
అందులో నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ‘ డబ్బు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు.తెలంగాణ
జాగృతి ఏర్పాటు చేసి ఆమె రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. రాజకీయాలను డబ్బు ఎంతగా కలు షితం చేసిందో … కవిత అభిప్రాయాలను తెలుసుకోవాలనుకునే వాళ్లు ఈ సమావేశానికివెళ్ళవచ్చు. వివరాలివిగో: