కష్టాల్లో ఉన్నపుడు పోలీస్ నెంబర్ 100 ఎందుకు గుర్తుకు రాదు?

కొంచెం ఉపోద్ఘాతం:
గురజాాడ అప్పారావు  రాసిన కన్యాశుల్కం నాటకంలో ఒక పాత్ర ఒక మాట అంటుంది: స్వాతంత్య్రం వస్తే మనవూరి హెడ్ కానిస్టేబుల్ మారతాడా , అని. స్వాతంత్య్రం వచ్చాకే కాదు, తెలంగాణ వచ్చాక కూడా మారలేదు. ప్రమాదం లో చిక్కుకున్న డాక్టర్ ప్రియాంక రెడ్డి, తన  చెల్లెలికి కాకుండా పోలీస్ నెంబర్ 100 కి చేసి ఉండాల్సింది అనేదాన్ని నిన్నటి నుంచి కొంత మంది జ్ఞానులు బాాగా ప్రచారం చేస్తున్నారు.   బంగారు తెలంగాణా రాగానే కష్టాల్లో ఉన్న ప్రజలు తలుచుకునేంత దేవాలయం స్థాయికి పోలీస్ స్టేషన్ ఎదగ లేదు. గత వందేళ్లలో పోలీస్ యాటిట్యూడ్  పెద్దగా మారలేదు. కన్యాశుల్కం డైలాగ్ వందేళ్ల పాతది. ఇపుడన్న పరిస్థితికి అద్దం పడుతుంది.  అనుకోకుండాకష్టాల్లో పడ్డ  ప్రియాంకకే  కాదు, నేరం చేస్తున్న వాళ్ళకి తెలంగాణా పోలీసుల నెంబర్ 100 గుర్తుకు రావాలిగా?  నేరం చేస్తున్న ప్రతివాడికి ఈ నెంబర్ కళ్ల ముందు ప్రత్యక్షమయి  ఎందుకుభయపెట్టడం లేదు. అదీ  నెంబర్ 100 కు శక్తి. దానికి రోటీన్ కేసులకేమో గాని, అది ఇంకా సంజీవని కాలేదు.
ప్రతినేరస్థుడికి లేదా నేరం చేయాలనుకున్న ప్రతివాడికి 100 నెంబర్ గుర్తొచ్చి, గజగజ వణికి, నేరం మానేసి పరుగు లంగించుకునే పరిస్థితి ఎందుకు తీసుకురాలేకపోయారు? కారణం సింపుల్.
బంగారు తెలంగాణ లేదా ఫ్రెండ్లిపోలీసులు అని ఏ పేరు పెట్టినా ఒకటే పరిస్థితి 2014 కు ముందున్నదే. అదే కొనసాగుతున్నది.
జనంమధ్య ఉన్నా ప్రజలు ఏ మాత్రం గౌరవించని ప్రదేశం ఒక్కటే- అదే పోలీస్ స్టేషన్. ప్రజలు, ముఖ్యంగా మహిళలు వెళ్లేందుకు ఇష్టపడని ప్రదేశం ఒక్కటే, అదే పోలీస్ స్టేషన్. పక్కనే ఉన్నా మనం కన్నెత్తి చూసేందుకు ఇష్టపడని ప్రదేశం, అదే పోలీస్ స్టేషన్.
పోలీస్ స్టేషన్  లో ఎవరుంటారు, ఎవరు ఎక్కడ కూర్చుంటారు, వాళ్ల విధులేమిటి, వాళ్లఫోన్ నెంబర్లేమిటి; ఎలా ఫిర్యాదుచేయాలి, మన ఉండేది ఏ  పోలీస్ స్టేషన్ పరిధి (Jurisdiction)… తెలుసుకునేందుకు ఎవరూ ఇష్టపడరు. ప్రజల మొబెల్ కాంటాక్ట్ నెంబర్లలో లోకల్ పిఎస్ నెంబర్లుండవు.
అంతేకాదు,పోలీస్ స్టేషన్ లో ఎపుడయినా మీ  మిస్సింగ్ డాటర్ గురించి కంప్లెయింట్ చేసేందుకు వెళ్లారా?  స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి వచ్చే కామెంట్లు వింటే ఇక మీరు మళ్లీపోలీస్ స్టేషన్ కు వెళ్లరు.
అందువల్ల ఎక్స్ ట్రీం డేంజర్ లో ఉన్నపుడు ఎవరైనా గుర్తుకొస్తారు గాని, పోలీసులు గుర్తుకు రారు. పోలీసుల నంబర్ 100 గుర్తుకు రాదు.
పోలీసుల నంబర్ గుడిగంట కాదు. కష్టాల్లో ఉన్నపు డు మొదట మొదట ఇల్లు, తర్వాత ఆత్మీయులు గురొస్తారు. తర్వాత ఎక్కడో ఉన్న దేవుడిని నమ్ముకుంటాం తప్ప పక్కనే ఉన్నా పోలీసుల మీద భారం వేయం. ఎందుకు?
ఏదయినా పెద్దసమస్య వచ్చిన పుడు ‘చూద్దాం, దేవుడున్నాడు అనుకుంటాం తప్ప’, ‘చూద్దాం, మా పోలీస్ స్టేషన్ ఉంది, మా ఎస్ ఐ ఉన్నాడు,’ అని ఎవరూ అనుకోరు. ఎందుకు?
ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి డాక్టర్ ప్రియాంక, చెల్లెలికి కాకుండా పోలీసుల నెంబర్ 100 కు ఫోన్ చేయకుండా తప్పు చేసిందనే ధోరణిని ప్రచారమవుతూ ఉంది. ఇది  కేవలం ప్రియాంక తల్లితండ్రుల ఫిర్యాదును జ్యూరిష్ డిక్షన్ కాదనే పేరుతో తిరస్కరించిన పోలీసులనుకాపాడేందుకు మొదలుపెట్టిన ప్రచారమే తప్ప మరొకటికాదు.. ప్రియాంకకు సరే,  మరి నేరం  చేస్తున్న దుర్మార్గులకు పోలీసుల భీకర రూపం, ఫోన్ నెం 100 ఎందుకు గుర్తుకు రాలేదు?
పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపితేనే అది తెరాస ప్రభుత్వం వ్యతిరేక కామెంటనుకునే వాళ్లంతా డాక్టర్ ప్రియాంక 100 కు ఫోన్ చేయకుండా తప్పు చేసిందనే భావన ప్రచారం చేస్తున్నారు.
వాళ్లకి ప్రముఖ జర్నలిస్టు సి. వనజ చెబుతున్న సమాధానం ఇది:

 

100 కి డయల్ చేసి ఉంటే బతికి ఉండేది. 100 కి డయల్ చేసి ఉంటే బతికి ఉండేది. ఉదయం నుంచి వాట్సప్ లో సోషల్ మీడియాలో వినివిని చికాకొస్తోంది. చివరికి డీజీపీ, పోలీసు కమిషనర్లు, హోం మంత్రి కూడా ఇదే పాట. ఆమె 100 కి డయల్ చెయ్యలేదు కనుక అమెకిలా జరిగింది. ఆమె అలాంటి బట్టలు వేసుకుంది కనుక అలా జరిగింది. ఆమె ఆ టైమ్ లో బయటికి వెళ్ళింది కనుక అలా జరిగింది అనటానికి దీనికి తేడా ఏమిటి? ఇంకొంత మంది ఇంకో అడుగు ముందుకు వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన వెంటనే వాళ్ళ తల్లితండ్రులు అక్కడికి ఎందుకు పోలేదు అనికూడ అంటున్నారు. ఇదంతా కూడా విక్టిమ్ బ్లేమింగ్.
ఒకవైపు వ్యవస్థల ధ్వంసం మరోవైపు బాధ్యతా రహిత మైన ప్రభుత్వాలు ఉన్నపుడు సమాజం ఇలా విక్టిమ్ బ్లేమింగ్ చేసుకొని తప్పుడు సమాధానాలతో సంతృప్తి పడుతుంది. ఈ విక్టిమ్ బ్లేమింగ్ కి వాలిడిటీ ఇవ్వటానికి మనకు ఆస్థాన ప్రవచన కర్తలు ఎలాగూ ఉన్నారు కద.
నిజంగా 100 కి డయల్ చేస్తే ఆమె save అయ్యేదా? ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన గంటలోపల ఆమె తల్లి తండ్రులు మూడు పోలీసు స్టేషన్లను ఫోన్ లో అప్రోచ్ అయ్యారు. ఎవరికి వారు తమ jurisdiction కాదని తప్పించుకున్నారట. ఇది నిర్భయ ఘటనలో కూడా చూసాం. ఆమె చావు బతుకుల్లో రోడ్డు మీద పడి ఉంటే పోలీసులు jurisdiction అనే వికృత క్రీడ గంటకు పైగా ఆడారు. ఆ తర్వాత జరిగిన చర్చల్లో, నిర్భయ చట్టం వచ్చిన సందర్భంలో ఒక crime ని ఆపడానికి ఇది సాకు కాకూడదని కోర్టు లు తేల్చాయి. కంప్లైంట్ ఎక్కడ ఇచ్చిన తీసుకుని, zero FIR బుక్ చేసి తర్వాత jurisdiction ఉన్న PS కి ట్రాన్స్ఫర్ చెయ్యాలని స్పష్టంగా చట్టం ఉంది. కానీ jurisdiction వికృత క్రీడ అలవాటయిన వాళ్లకు ఈ చట్టం ఎక్కదు. 100 కి డయల్ చేసినా ఇదే వికృత క్రీడ ఉంటుంది. 100 కి వచ్చే పోలీసులు కూడా వాళ్ళే కదా. 100 కి డయల్ చెస్తీ రెస్పాన్స్ రాని వెలాది కథల మాటేమిటి.
కానీ ఆ తల్లితండ్రులు రాత్రి 11.00 గంటలకు jurisdiction కనుక్కుని స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళకు వచ్చిన సమాధానం ఏమిటి? ఎవరితో అయినా పోయి ఉంటుంది. చివరి ఫొన్ కాల్ లో ఫలానా పరిస్థితి లో ఉన్నానని, భయం వేస్తుందని, ఒక అమ్మాయి ఏడుస్తూ చెప్పిందని చెప్తే కూడా లేచిపోయి ఉంటుందిలే అన్నదే ఫ్రెండ్లీ పోలీసు సమాధానం. ఇలాంటి సమాధానాలు ఇచ్చే కదా హజిపుర్ లో ముగ్గురు ముక్కుపచ్చలారని ఆడపిల్లలను బలి ఇచ్చింది. అదే పాఠంగా తీసుకుని పోలీసులను, వ్యవస్థను అప్పుడే సెట్ రైట్ చేసి ఉంటే ఇవ్వాళ ఇది అపగలిగే వాళ్ళు కాదా? ఏ అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ వచ్చినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రెస్పాండ్ అవ్వండి అని కింది దాకా మెసేజ్ పంపాల్సిన అధికారులు, మంత్రులు, ఆడపిల్ల వైపు చూస్తే కళ్లు పీకేస్తామన్న ముఖ్యమంత్రులు ఆపని చెయ్యకుండా విక్టిమ్ బ్లేమింగ్ కి దిగటం ఎలాంటి దగుల్బాజీ తనం.
మరోవైపు సమాజంలో విపరీతంగా పెరిగిపోతున్న హింసా సంస్కృతి నీ మార్చటానికి ప్రభుత్వాలు ఎం చేస్తున్నాయి? ఏడాది తర్వాత ఏడాది మహిళలపై హింస లో తెలంగాణ అగ్రభాగాన నిలబడుతుంటే ఏలిన వారు దాన్ని మార్చటానికి ఏమైనా చేస్తున్నట్లు ఎప్పుడైనా ఒక్క మాటైనా మాట్లాడటం విన్నారా? మీకు మెక్కటానికి బంగారు తెలంగాణా వచ్చింది సరే మా జెండర్ సేఫ్ తెలంగాణా ఎప్పటికైనా వస్తుందా? అప్పుడప్పుడూ ట్విట్టర్ లో సెలెక్టివ్ outrage చూపిస్తే ఇది ఆగుతుందా? అసలు దీన్ని మార్చటానికి మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా?
అన్నిటికీ ప్రభుత్వాలని అంటే ఎలా ఇంటినుంచి మార్పు రావాలి అని సన్నాయి నొక్కులు నొక్కకండి. ప్రభుత్వాలు చెయ్యాల్సింది చాలా ఉంది. జెండర్ ఎడ్యుకేషన్ తేవాలి స్కూలు స్థాయి నుంచి. ప్రభుత్వం లో ప్రతి ఉద్యోగికి జెండర్ training ఇవ్వాలి. అటు పేదరికం వల్ల పట్టించుకునే కుటుంబం లేక, ఇటు బతకటానికి అవసరమయ్యే ఏ skill రాక నేర్పే వాళ్ళూ లేక ఫ్రస్టేషన్ నుంచి మీరు ఫ్రీగా అందిస్తున్న పోర్న్ చూసి పెర్వర్ట్ లు గా మారుతున్న teens ని reach out కావాలి. చెయ్యదలుచుకుంటే ఇన్కా చాలా ఉన్నయి. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటీ మార్పులు ఉద్యమాల వల్ల దాని వల్ల ఏర్పడె పొలిటికల్ విల్ వల్ల మాత్రమే జరుగుతాయి. మనకు ఉద్యమాలు గిట్టవు. పొలిటికల్ విల్ లేదు.
చెయ్యాల్సినవి ఎమీ చెయ్యకుండా అడుగడుగునా బాధ్యతా రాహిత్యం ప్రదర్సిస్తూ కెవలం విక్టిమ్ బ్లేమింగ్ చెస్తున్న, twitter సానుభూతులు, పరిష్కారాలు చూపిస్తున్న అధికారులను, మంత్రులను చూస్తుంటే పరమ అసహ్యం వెస్తుంది. చీ…
సి. వనజ (సోర్స్: సోషల్ మీడియా)