చిరంజీవి ఇంట్లో నాటి మేటి తారల ‘మీట్’

ఒకప్పుడు తమ సినిమాలతో అలరించిన ఎన‌భైల‌ నాటి తార‌లంతా ‘క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌’ పేరుతో ఏటా వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం తెలిసిందే. గత తొమ్మిదేళ్లుగా రకరకాల ప్రదేశాల్లో ఈ వేడుకలను నిర్వహించారు. పదో వార్షికోత్సవం సందర్భంగా ఆ వేదికను ఈ సారి చిరంజీవి నివాసానికి మార్చారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన స్వగృహంలో ఈ సారి రీయూనియన్‌ మీట్‌ను నిర్వహించారు.