జపాన్ లో ఒక సామెత ఉంది: శరీరంలో టీ లేని వాడు సత్యాన్ని చూల్లేడు, సౌందర్యాన్ని అస్వాదించలేడు (If a man has no tea in him, he is incapable of understanding truth and beauty)అని.
జపాన్ వాళ్ల నమ్మకాన్ని శాస్త్రేవేత్తలీ మధ్య దీన్నినేరుగా చెప్పకపోయినా, పరోక్షగా చెబుతున్నారు. టీ తాగితే మెంటల్ క్లారిటీ , ఎటెన్షన్ స్పాన్ పెరిగి, ఎలెర్ట్ గా తయారవుతారు అని, అపుడు సత్యమూ సౌందర్యం దాని కవే కనపడతాయి.
ప్రపంచంలో నీళ్ల తర్వాత ప్రజలు ఎక్కువ తాగే పానీయం టీ (Camellia Sinensis) మాత్రమే. చాలా దేశాలలో టీ అనేది ప్రాథమిక పానీయం.టీ తాగే అలవాటు వేల సంవత్సరాలుగా ఉంది. టీలో ఉన్న ఔషధ గుణాలను చాలా దేశాల పూర్వీకులు గుర్తించారు.అందుకే టీని ఒక ఔషధంగా చూస్తుంటారు. నాకు తెలిసి డాక్టరొకాయన చిన్నపిల్లలకు విరేచనాలొచ్చినపుడు టీ తాపమని తల్లితండ్రులకు చెప్పడం నాకు తెలుసు. పెద్దలు కూడా ఇలాగే టీ తాగి విరేచాలను తగ్గింవచ్చని ఆయన చెప్పారు.
అయితే, ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో మరిన్ని ఆసక్తి కరమయిన విషయాలు వెల్లడయ్యాయి. ఇంతవరకు టీని యాంటి ఆక్సిడెంట్ అనో యాంటి మ్యూటజెనిక్ అనో యాంటి క్యాన్సరస్ అనో చెప్పుకుంటూ ఉండేవాళ్లు.
ఇపుడు టీలో విద్యార్థులకు పనికొచ్చే గొప్పగుణం ఉందని తెలిసింది. ఇది ఆహ్లదాన్ని ఇవ్వడంతో పాటు లర్నింగ్ (Learning) సామర్థ్యాన్ని పెంచుతుంది. ఒక విషయం మీద మన దృష్టి నిలిపేందుకు (Attention)సాయపడుతుంది. మనసును అప్రమత్తంగా ఉంచుతుంది.
మెంటల్ క్లారిటీ, ఫోకస్, అలర్ట్ నెస్ అనేవి విద్యార్థుల దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు చాలా అవసరం. ఈమూడు టీ వల్ల లభిస్తాయని ఇపుడు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి కారణం టీ లో ఉన్న ధియనైన్ (Theanine) అని రసాయనం. ఇది శరీరంలో తయారు కాదు. టీతో పాటు కొన్నిరకాల పుట్టగొడుగుల్లో లభిస్తుంది. టీ లో నయితే మొక్కంతా వ్యాపించి ఉంటుంది. అందుకే టీ అనేది ధియనిన్ అందిచే ప్రధాన పానీయం అయింది.
ఇంతవరకు టీ గురించి చెప్పుకున్నపుడు అందులో కెపీన్ గురించి ప్రముఖంగా చెప్పుకునే వాళ్లం. ఇపుడు థియనైన్ ను గురించి చెప్పుకోవాల్సి వస్తున్నది. ఎందుకంటే ధయనైన్ శరీరంలోచేసే మంచి పనులేవో శాస్త్రవేత్తల గుర్తించారు. అవి ఒకటిరెండు కాదు, లెక్కలేనన్ని. ఒక్కమాటలో చెబితే, మనం రోజు ఎక్కడ బడితే అక్కడచూస్తున్నందున టీ గొప్పదనం గురించి, టీ మన శరీరంలోకి ప్రవేశించింత ఏంచేస్తున్నదనేదాని మీద శ్రద్ధ పెట్టలేదు. అయితే, శాస్త్రవేత్తలు టీని జీవామృతం అని పిలుస్తున్నారు.
కాఫీలోకంటే టీ కెఫీన్ తక్కువగా ఉంటుంది. కాఫీ తాగితే పళ్లకు చారలొచ్చినట్లు టీ తాగితే రావు. అయితే, ఈ కారణం చేత టీ మేలని చెప్పడం పాత పద్దతి.
ఇపుడు విద్యార్థులకు అసవరమయిన మూడు లక్షణాలు, మెంటల్ ఎలెర్ట్ నెస్, ఫోకస్, క్లారిటీ ఇస్తాయని తెలియడంతో విద్యార్థులు టీ తప్పక తాగాల్సిన పానీయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
టీలో ముఖ్యంగా గ్రీన్ టీలో 26 అమైనో యాసిడ్స్ గుర్తించారు. ఇందులో అన్నింటికంటే ప్రముఖమయింది N-Ehtyl-L- Glutamine .దీనినే ఎల్ థయనైన్ (L-The) అని కూడా అంటారు.దీనికి ఉన్న గొప్ప గుణాలు ఈ మధ్య పరిశోధనల్లోవెల్లడయ్యాయి.
ఇది నీళ్లలో కరిగే నాన్ ప్రొటినస్ ఎమైనో యాసిడ్. దీని బాయిలింగ్ పాయంట్ 214 నుంచి 216 డి.సెం.
ఇదే విధంగా దీనికి న్యూరో ప్రొటెక్టివ్ స్వభావం కూడా ఉంది , ఆరోగ్యంగా ఉన్న మనిషిలో ఎటెన్షన్ పర్ ఫామెన్స్ ను కూడా పెంచుతుంది. ఏదైన పనికి మనం స్పందించే వేగాన్ని కూడా ఇది పెంచుతుంది. అంతేకాదు, టీ లో ఉన్న కెఫీన్ స్వభావాన్నిఇది తగ్గించడం కాకుండా దానితో కలసిపనిచేస్తుందని దాని వల్ల టీ వైద్యగుణాలు ఇంకా పెరుగుతున్నాయని శాస్త్త్ర వేత్తలు చెబుతున్నారు.
అంతేకాదు, ఎల్ ధయనైన్ శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ ను కూడా బలపరుస్తుందని కొన్ని స్టడీస్ కనిపెట్టాయి. అప్పర్ రెస్పిరేటరీట్రాక్ ఇన్ ఫెక్షన్ కూడా ఇది తగ్గిస్తుంది.