అమరావతి రాజధాని స్టార్టప్ క్యాపిటల్ ఏరియా నిర్మాణాన్ని రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయాన్ని సింగపూర్ ప్రభుత్వం ఆమోదించింది.
ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వం ఒకప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ కన్సార్టియ్ పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నందున సింగపూర్ ప్రభుత్వం ఆమోదించిందని ఈ ప్రకటనలో తెలిపారు. సింగపూర్ కన్సార్టియంలో ఎసెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెంబ్క కార్ప్ డెవెలప్ మెంట్ లిమిటెడ్ లు ఉన్నాయి.
సింగపూర్ ట్రేడ్ రిలేషన్స్ ఇన్ చార్జ్ మంత్రి ఎస్ ఈశ్వరన్ అమరావతి స్టార్టప్ ఏరియా డెవెలప్ మెంటు రద్దు మీద స్పందించారు.
2017 లో 6.84 చ.కి లో అమరావతిరాజధాని స్టార్టప్ ఏరియాలో మాస్టర్ ప్లాన్ తయారుచేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కన్సార్టియమ్ ను నియమించిందని చెబుతూ తమకు ఇతర ముఖ్యమయిన కార్యక్రమాలున్నందున అమరావతి స్టార్టప్ ప్రాజక్టు ను కొనసాగించలేమని చెప్పిన కొత్త ప్రభుత్వం కొత్త ప్రాధాన్యతలను తాను అర్థం చేసుకోగలనని మంత్రి ఈశ్వరన్ వ్యాఖ్యానించారు.
విదేశాలతో ఒప్పందాలనుచేసుకునే ముందు కంపెనీలు కూడా ఇలాంటి సమస్యలను గుర్తిస్తాయని , వాటిని దృష్టిలో పెట్టుకునే ఇన్వెస్ట్ మెంటు నిర్ణయాలను తీసుకుంటాయని ఆయన అన్నారు.
ఈ ప్రాజక్టులో చేరినందుకు తమకు కొన్ని మిలియన్ల డాలర్లు వ్యయమయినా, ఇపుడు ప్రాజక్టు రద్దు చేసిందున భారత దేశంలో తమ ఇన్వెస్ట్ మెంట్ల మీద అది ఎలాంటి దుష్ప్రభావం చూపదని ఈ కంపెనీలు చెప్పాయని ఆయన అన్నారు.
అయినప్పటీకి ఆంధ్రప్రదేశ్ తో భారతదేశంలో ఎక్కడయినా పెట్టుబడులు పెట్టేందుకుసింగపూర్ కంపెనీలు ఆసక్తి చూపుతూనే ఉంటాయని ఆయన చెప్పారు. విదేశాలలో సింగపూర్ కంపెనీలు పెట్టుబడి అవకాశాలను పెంపొందించుకునేందుు సింగపూర్ ప్రభుత్వం ఎపుడూ సహకారం అందిస్తూనే ఉంటుందని ఈశ్వరన్ తెలిపారు.