అధికార భాష సంఘ సభ్యుల నియామకం ,రాయలసీమ ప్రతినిధి లేరు

ప్రాథమిక స్థాయిలో ఒకటో  తరగతి నుంచి ఆరోతరగతి వరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియా ప్రవేశపెట్టింది.దీనిని కొంత మంది తెలుగు అభిమానులు నిరసించారు. ఇది తెలుగు భాషను ప్రోత్సహించడం కాదని వారు వాదించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తెలుగు భాష ను ప్రోత్సహించడానికి  కట్టుబడి ఉందని చెప్పేందుకు ఈ రోజు ప్రభుత్వ ఉత్తర్వును (జివొ)ని తెలుగు లో విడుదల చేశారు. సాాధారణ పాలనా శాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పేరు మీద ఈ జివొ విడుదలయింది.ఇలా అన్ని జివొ లు తెలుగు లో విడుదలవుతాయా? ఆ జివొ ఇదే…ఇలా
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అధ్యక్షతన ఏర్పడిన అధికార భాషసంఘానికి సభ్యులను నియమిస్తూ ఇచ్చిన జివొ ఇది. సభ్యులుగా  ఆచార్య చందుసుబ్బారావు, మోదుగుల పాపిరెడ్డి, ఆచార్య షేక్ మస్తాన్, ఆచార్య శ్రీమతి శరతజ్జ్యో స్నారాణి ఉన్నారు. ఇందులో రాయలసీమ వారికి ప్రాతినిధ్యం లేదని ఆ ప్రాంతీయులు చెబుతున్నారు. ఈ విషయాన్ని డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ రెడ్డి ఎత్తి చూపారు.