RTC సమ్మె-37… రేపు ఎమ్మెల్యేల, మంత్రుల ఇళ్ల ముందు RTC JAC ధర్నా

రక్తం చిందినా, దాదాపు అయిదు వేల నేతలను అరెస్టుచేసినా
 ఆర్టీసీ జేఏసీ ఉద్యమాన్ని ఎమ్మెల్యేల, ఎంపిల ఇంటి ముందుకు తీసుకుపోవాలనుకుంటూ ఉంది. ఈ విషయాన్ని జెఎసి కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి ప్రకటించారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకోసం చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 37వ రోజుకు చేరింది.
నిన్న ట్యాంక్ బండ్ వద్ద మిలియమ్ మార్చి నిర్వహించిన కార్మికులు ఇవాళ అన్ని డిపోల ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలుపనున్నారు.
తమ 26 డిమాండ్ల సాధన కోసం 48వేల మంది కార్మికులు 36 రోజులు సమ్మె పూర్తి చేశారు. మహాసమ్మె నడిపేందుు మహానేతలు అవసరం లేదని ఆర్టీసి కార్మికులు రుజువుచేశారు. తెలంగాణలో సమస్యల పరిష్కారినికి బాధితులందరికి ఇదొక గొప్ప సందేశం
ఇన్ని రోజుల పాటు సమ్మె కొనసాగడం ఇదే తొలిసారి.
నిన్న చలో ట్యాంక్ బండ్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి   ఆయన  ధన్యవాదాలు తెలిపారు.ముఖ్యంగా మొక్కవోని పోరాట దీక్ష ప్రదర్శించి  ట్యాంక్ బండ్ ఎక్కిన మహిళా కార్మికులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ఆయన ప్రకటించారు. ఈ సందర్బంగా కొత్త కార్యాచరణ ప్రకటించారు.
కార్యాచరణ
రేపు నియోజకవర్గాల లో టిఆర్ ఎస్  ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ,మంత్రులు ఎంపీల ఇలా ముందు నిరసన ప్రదర్శనలుంటాయి.
నవంబర్  12 న నుండి జేఏసీ కన్వీనర్ గా నాతో పాటు మిగిలిన ముగ్గురు కో కన్వీనర్ లు అశ్వద్ధామరెడ్డి ,రాజిరెడ్డి , లింగమ సుధ లు నిరవధిక దీక్ష చేస్తారు.
నవంబర్ 13 న నిన్న జరిగిన దాడిపై ఢిల్లీ వెళ్లి మానవ హక్కుల కమిషన్ ను కలుస్తాం, వనతిపత్రం సమర్పిస్తాం.
నవంబర్ 14 న సడక్ బంద్ ఉంటుంది. ఆర్టీపి కార్మికులంతా  రోడ్ల మీదకు వచ్చి మొత్తం దిగ్బంధించాలి.
నిన్న వచ్చిన వారు ఆర్టీసీ కార్మికులు మాత్రమే అందులో మావోయిస్టులు ఎవరు లేరని ఆయన స్పష్టం చేశారు.
 నిన్నటి కార్యక్రమంలో మావోయిష్టులున్నారని పోలీసు  కమిషనర్ అన్న మాటలను ఖండిస్తున్నాం మా ఉద్యమాన్ని అణచడానికే దీనిని మావోయిస్టు కోణంలోనుంచి  చూస్తున్నారు, అని అశ్వత్థామ రెడ్డి అన్నారు.