హైదరాబాద్ లోని అంబర్పేట ఏరియా గోల్నాక ప్రాంతంలో ఫర్ల్ ఫంక్షన్ హాల్ గోడకూలడంతో నలుగురు వ్యక్తులు చనిపోయారు. ఈ దుర్ఘటన అక్కడ ఒక వివాహం కార్యక్రమం జరగుతున్నపుడు సంభవించింది. వారంతా అక్కడికక్కడే మృతిచెందారు.మరొక ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.వారిని ఆస్పత్రికి తరలించారు. పంక్షన్ హాలు యాజమాన్యం అక్రమ నిర్మాణాలుజరిపిందని, ఇపుడు కూలింది అక్రమ నిర్మాణమే నని అంటున్నారు. యాజమాన్యం మీద కేసు నమోదు చేసి శిక్షించాలని మరణించిన వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.