పేదల బడుగు వర్గాల కోసం జీవితాంతం కృష్టి చేసిన రిటైర్డు ఐఎఎస్ ఆఫీసర్ పి ఎస్ కృష్ణన్ మృతి చెందారు. ఆయన 1956 సంవత్సరం బ్యాచ్ ఐఎఎస్ అధికారి. ఆయన వయసుల 86సంవత్సరాలు. రిటరయ్యాక కూడా ఆయన బడుగు వర్గాల బాగుకోసం చేస్తున్న తన కృషి ని ఆపలేదు. కొంత కాలంగా అస్వస్థతో ఉన్న ఆదివారం ఉదయం ఢిల్లీ అపోలోలో కన్నుమూశారు.
కేంద్రంలో ఎన్నో రాజ్యంగ సవరణలకు, నిర్ణయాలకు ఆయనే కారణం.అన్నింటికంటే ముఖ్యంగా మండల్ కమిషన్ నివేదికను అమలుచేయించడంలో ఆయన పాత్ర మరువరానిది. అదే విధంగా ఎస్ సి ఎస్ టి జాతీయకమిషన్ కు రాజ్యాంగ హోద రావడానికి, ఎస్ సి ఎస్ టి ఎట్రాసిటీస్ (ప్రివెన్షన్ ) చట్టం 1989 రావడం వెనక ఆయన కృషి ఉంది.
స్వతంత్ర భారత దేశంలో సామాజిక న్యాయం, సాంఘిక సంక్షేమం అనే మాటలకు ఆయన నిలువెత్తు సాక్ష్యం. ఉద్యోగాన్ని ఉద్యమం చేసుకున్న అరుదైన ఐఎఎస్ అధికారి కృష్ణన్.
1956వ సంవత్సరం ఐఎఎస్ లో మొదట హైదరాబాద్ స్టేట్ క్యాడర్ కు ఎంపికయ్యారు.
తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎపి క్యాడర్ అయ్యారు. సామాజిక న్యాయ సాధన అనేది ఆయన తన జీవితకాల కార్యక్రమంగా ఉండింది. ఈ అంశం మీద ఇంతగాపరితపించే అధికారులు అరుదు. వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖని సామాజిక న్యాయ శాఖగా పేరు మార్చి ఆశయాన్ని కొత్త దిశ వైపు మళ్లించడంలో ఆయన పాత్ర ఉందని చెబుతారు. అయితే, రామూవాలియా ఉన్నంతవరకుబాగానే ఉండింది. తర్వాత మేనకా గాంధీ మంత్రిగా వచ్చాక ప్రయారిటీస్ మారిపోయాయి. ఆయన అంబేద్కర్ ఫౌండేషన్ లో తనపనినుంచి తప్పుకున్నారు.
చిత్రమేమిటంటే ఆయన పుట్టినది భారతీయ సమాజానికి చెందిన అత్యున్నత కులంలో జీవితాన్నిఅంకితం చేసింది అట్టడుగుకు కులాలసంక్షేమానికి. ఆయన బాబాసాహేబ్ అంబేద్కర్, గాంధీ,నారాయణగురు, వివేకానంద, పెరియార్ ల స్ఫూర్తితో పనిచేశారు. ఈ విషయాన్ని ఆయనే చెబుతూ వచ్చారు. ఆయనతో పనిచేయడం చాలా ఉత్తేజకరంగా ఉంటుంది.ఎపుడూ అధికార దర్పం ప్రదర్శించరు. సింప్లిసిటీకి మారు పేరు.
స్వాతంత్రం వచ్చిన కొత్త రోజులవి. ఎస్ సి, ఎస్టి, బిసి, గ్రామీణ పేదలతో ప్రభుత్వం మీద విశ్వాసంపెంపొందించేందుకు పల్లెలకు వెళ్లినపుడు వాళ్లమధ్యే ఉండాలనే ఆలోచనకు ఆధ్యుడాయనే.
1957లో కుర్ర ఐఎఎస్ ఆఫీసర్ గా ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఇలా పేదల బస్తీలలోగడిపే వాడు. ఎస్ సి స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్ 1978 రావడం వెనన ఆయన కృషి ఉంది. రాష్ట్రాలలో ఎస్ సి డెవలప్ మెంట్ కార్పొరేషన్లు కూడా ఆయన ఆలోచనే. 1990లో రాజ్యంగ సవరణ తీసుకువచ్చి ఎస్ సి ఎస్ టి జాతీయ కమిషన్ కు రాజ్యంగా హోదా ఇప్పించిందాయనే. దళిత్ బుద్ధిస్టులకు ఎస్ సి హోదా రావడంలో, 1993లో వచ్చిన ఎంప్లాయ్ మెంటు ఆఫ్ మాన్యవల్ స్కావెంజర్స్ అండ్ కనస్ట్రక్షన్ ఆఫ్ డ్రైలెట్రిన్స్ (ప్రొహిబిషన్ ) చట్టం తీసుకురావడంలో ఆయన పాత్ర ఉంది.
1990లో ఆయన కేంద్ర కార్యదర్శిగా రిటైర్యారు. 1991-92లో జాతీయ ఎస్ సి ఎస్ టి కమిషన్ సభ్యుడిగా ఉన్నారు. తర్వాత 1993లో వెనక బడిన తరగతుల మీద వేసిన నిపుణుల కమిటిలో, 1993-2000 దాకా జాతీయ వెనకబడినతరగులు కమిషన్ లో సభ్యుడిగా ఉన్నారు. 2006 లో భారత ప్రభుత్వం ఆయనని ఉన్నత విద్యాసంస్థలలో ఎస్ సి ఎస్ టి ఎస్ఇడి బిసిలకు రిజర్వేషన్లు కల్పించాల్సివచ్చినపుడు సుప్రీంకోర్టు లో ప్రభుత్వ వాదనను వినిపించడానికి సలహాదారుగా నియమించింది.2007లో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలనకున్నపుడు పిఎస్ కృష్ణన్ ని సలహాదారుగా నియమించారు. కృష్ణ న్ అనేక పుస్తకాలు, పరిశోధనా వ్యాసాలు రాశారు.