ఈరోజు వెలువడిన అయోధ్య భూవివాద తీర్పు దేశంలో ఎలాంటి వివాదం సృష్టించలేదు.విపరీతంగా సెక్యూరిటీ ఏర్పాట్లను ముందు జాగ్రత్తగా తీసుకున్నా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నాయకత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చి న తీర్పు మీద అసమ్మతి వ్యక్తం చేస్తూ నే ముస్లిం సంస్థలు తీర్పును గౌవరిస్తామని ప్రకటించాయి. గొప్ప రిలీఫ్.
అయితే, తీర్పులో ఉన్న గ్యాప్స్ మీద బాగ చర్చజరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, తీర్పులో సమతౌల్యం లోపించినట్లు అపుడే వాఖ్యాలు మొదలయ్యాయి.
వాస్తవాలు కంటే కేసులోని ఒక పార్టీ మతవిశ్వాసాలకు పెద్ద పీట వేసినట్లుందని ఎఐఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
దీనికి కారణం తీర్పులో ఒక ముఖ్యమయిన లాజిక్ బలహీనంగా ఉండటమే.
ఇందులో ప్రధాన మయిన గ్యాప్ తీర్పులోని 215వప పేజీలో ఉందన్న విషయం వైరలవుతూ ఉంది. ఎందుకంటే, ఈ వివాదాస్పద 2.77 ఎకరాలు తనవే అంటూ సున్నీ వక్ఫ్ బోర్డు వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టి వేసింది.ప్రార్థనలు చేసినంత మాత్రం సాక్ష్యం కాదంది. ఇలా ఏ డాక్యుమెంటు చూపకపోయినా, విశ్వాసం అధారంగా ఈ స్థలాన్ని హిందూసంస్థకు అప్పగించారు. ఇదీ తీర్పులోని వైరుధ్యం అని అంటున్నారు.
ఎందుకు?
ఈ బోర్డు ఈ భూమితనదేననేందుకు ఒక్క డాక్యమెంటుకూడా కోర్టుకు సమర్పించలేకపోయింది. అందువల్ల పిటిషన్ ను కోట్టివేసున్నట్లు తీర్పు పేర్కొంది. వక్ఫ్ బోర్డుకు అయిదెకరాల స్థలం అయోధ్యలో కేటాయించడం వేరే విషయం. అయితే, ఈ 2.77 ఎకరాల స్థలం తనదే అనేందుకు వ్యాజ్యంలో భాగస్వాములయిన హిందూసంస్థలు డాక్యుమెంట్లు సమర్పించాయా? లేదుగా,మరెలా ఈభూమిని ఆసంస్థలకు కేటాయించారనేది ప్రశ్న.
ఇపుడు తీర్పులో 215 వ పేజీకొద్దాం. ఈపేజీలో కోర్టు ఒక లాజిక్ ప్రవేశపెట్టింది. అదేమిటంటే మత విశ్వాసాల, నమ్మకాల విషయానికి వచ్చినపుడు సాక్ష్యాధారాలు లేకపోవడమనేది సాక్ష్యం లేనేందుకు నిదర్శనం కాదు, అని.
” It is true that in matters of faith and belief, the absence of evidence may not be evidence of absence.”
ఇది చాలా గొప్పలాజిక్. అయితే, చివరికొచ్చే సరికి తీర్పులో ఇది తారుమారయింది.ఇక్కడే మో విశ్వాసాలకు పెద్ద పీఠవేసింది.విశ్వాసాలుబలంగా ఉన్నచోట సాక్ష్యం లేకపోవడం (absence of evidence)లో కూడా సాక్ష్యం ఉందనడం దీనర్థం.
అదేమిటంటే మత విశ్వాసాలు. Absence of evidence, evidence of absence అనే రెండుమాటల మధ్య సంబంధం వివరించిందీ తీర్పు. అందుకే ఈ మాటలు న్యాయచరిత్రలో మిగిలిపోతాయి. ఇలాంటి మతవిశ్వాసాలు ముస్లింలకువర్తించవా?
ముస్లింసంస్థ ఫిజికల్ ఎవిడెన్స్ గా ఒక డాక్యమెంటు ను కూడా చూపలేదని కోర్టు చెప్పింది. భూమిమీద హక్కుకు ముస్లింలే సాక్ష్యంగా పత్రాలను చూపాలనడం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది.
ఒకరు సాక్ష్యం చూపించలేనపుడు మత విశ్వాసమే సాక్ష్యం అనడం,మరొకమత విశ్వాసం చూపించినపుడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అడగం కనిపిస్తుందని స్క్రో ల్ న్యూస్ లో ఒక విశ్లేషణ వచ్చింది.
ఈ తీర్పులో ముస్లిం మత విశ్వాసాలకంటే హిందూ మత విశ్వాసాలవైపు కోర్టు మొగ్గు చూపినట్లయిందని స్క్రోల్ విశ్లేషించింది.
కోర్టు పురావస్తు శాఖ తవ్వకాల నివేదికను సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకుంది. అలా తీసుకుంటూనే, మసీదు కిందఏవోనిర్మాణాలున్నాయని, కచ్చితంగా ఆలయాన్ని కూల్చి మసీదును కట్టారని పురావస్తుశాఖ తేల్చలేదని కూడా తీర్పు వ్యాఖ్యానించింది. దీనికి కారణం, ఆలయం చాలా పురాతనమయిందని (12 వ శతాబ్దం), తర్వాత చాలా కాలం తర్వాత మసీదును కట్టారని (1528) అని పేర్కొంది. మరలాంటపుడు ఏ సాక్ష్యం ప్రకారం వివాదస్పద భూమి ఒకవర్గానికి అప్పచెబుతారు?