అయోధ్య తీర్పు అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి

అయోధ్య వివాదాస్పద భూమి వ్యవహారంలో సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు తమకు అసంతృప్తి కలిగించిందని, తీర్పు వాస్తవాలకంటే విశ్వాసాలకు పెద్ద పీట వేసిందని,  అయితే   తీర్పును గౌరవిస్తున్నామని హైదరాబాద్ ఎఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.
బాబ్రి మసీదుకు అయిదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. దీనిని వదలుకోవడం బాధ గా ఉంది. ఎంఐఎం సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అయన చెప్పారు. సుప్రీం తీర్పు పై రివ్యూ పిటిషన్ వెయ్యలా? వద్దా? అని మీటింగ్ అనంతరం తెలియజేస్తామని అన్నారు.
ఒకవైపు 1992లో బాబ్రి మీసీదును కూల్చివేయడం తప్పని చెబుతూనే వివాదాస్పద స్థలంలో రామాయలయం నిర్మించేందుకు ట్రస్టు ను ఏర్పాటుచచేయాలని వారికే కోర్టు చెప్పిందని ఆయన అన్నారు.
ఈ తీర్పుువల్ల హిందూసంస్థల వల్ల మరిన్ని మసీదులకు కూల్చే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఎందుకంటే, చాలా మసీదులను ఆలయాలు కూల్చి  కట్టారని ఈ సంస్థచెబుతున్నాయని చెబుతూ వీటికి ముప్పుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ రోజు వెలువడిన సుప్రీంకోర్టు అయోధ్య తీర్పు మీద స్పందిస్తూ ఈ తీర్పు అసంపూర్తిగా ఉందని అందుకే తనకు అసంతృప్తిని కలిగించిందని ఆయన అన్నారు.
సుప్రీంకోర్టు ఒక వర్గం వారికి అనుకూలంగా తీర్పు ఇనట్టుగా ఉంది. అక్కడ బాబ్రీ మసీద్ ఉందన్నది శాస్త్రీయంగా తేలింది. ఇలాంటపుడు ఇపుడు ఇచ్చిన తీర్పు వల్ల  ముస్లిం వర్గానికి అన్యాయం జరిగినట్లు కదా,’ అని అసద్ వ్యాఖ్యానించారు.
2.77 ఎకరాల బాబ్రి మసీదు భూమిని అవతలి పక్షానికి అప్పగించి  ఐదెకరాల భూమి నష్టపరిహారం ఇవ్వడం దేనికని ప్రశ్నిస్తూ  తమకు ఈ ప్రాపర్టీ ఎందుకు, ఈ ఐదెకరాల స్థలం మాకు అవసరంలేదని ఆయన అన్నారు.
‘మేము ఎవరి వద్ద చేతులు చాపడం లేదు.తాము న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాం.  అయినా ల్యాండ్ కోల్పోవడం అనేది బాధాకరం. బాబ్రీ మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, దీనిని వాపసు ఇచ్చేయాలి,’ అని అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
*భారత్ ను హిందుఇజం నుంచి కాపాడాలి.

* భారత్ ను రక్షించేందుకు ధర్మం, న్యాయం ఉంది.

* సంఘ్ పరివార్ రాబోయే రోజుల్లో మసిద్ లను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
* ముస్లింలు ఎవ్వరికి బయపడొద్దు..భయపడి బతకాల్సిన అవసరం లేదు.
* న్యాయం కోసం పోరాటం చేద్దాం దేవుని పై నమ్మకంతో పోరాటం చేద్దాం