ఏం చేస్తాడు పాపం…పెబ్బేరు ఎమ్మార్వో ఆఫీసులో రైతు ఆత్మహత్య యత్నం (వీడియో)

రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అంటే రూలింగ్ పార్టీ అభిమానులకు బాాగా కోపమొస్తుంది. మా ముఖ్యమంత్రి ని అంత మాట అంటవా  అని ఆకాశమెంత ఎత్తు ఎరుగుతారు. మనకి అపోజిషన్ ఏజంటని బ్రాండ్ వేస్తారు. వాళ్లు అజ్ఞానాన్ని మనం మన్నించాల్సిందే. ఎందుకంటే, ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అనేది పొలిటిలక్ మీనింగ్, మావూర్లో రైతుకు  ప్రభుత్వం,మామూలు వాడికయితే పోలీసాయనం. కన్యాశుల్కంనాటకంలో కాంగ్రస్ అధికారంలో వస్తే మావూరి కనిస్టేబుల్ బదిలీ చేస్తారా అని అమాయకంగా ఒక మనిషి అడుగుతాడు. ఆయన దృష్టి తో బ్రిటిష్ ప్రభుత్వం అంటే వాళ్ల వూరి  కనిస్టేబులే.
అట్లాగే పేదరైతుకు ప్రభుత్వం అంటే ఏమ్మార్వో యే. ఈ ఏమ్మార్వోల పాత్ర రైతు ఆతహత్యల్లో ఎలా ఉంటుందో చెప్పేసంఘటన ఈ రోజు వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం ఎమ్మార్వో ఆఫీసులో జరిగింది.
అక్కడ ఒక రైతు ఆత్మాహుతి చేసుకునేందుకు పెట్రోొలు చల్లుకున్నాడు. అక్కడున్నవాళ్లు అడ్డుకున్నారు. అయితే, సమస్య పరిష్కారం కాదుగా.
తన భూమిని కాజేసేందుకు కొంతమంది అక్కడున్న రియల్టర్లు మహిళా ఎమ్మార్వో సహాకారంతో పనిచేస్తున్నారనేది రైతు ఆరోపణ. ఇదే కథేందో చూడండి ఎమ్మార్వో  అందునా మహిళా ఎమ్మార్వో ఏ పాత్ర పోషిస్తున్నదో అర్థమవుతుంది.
తనకు వంశపారంపర్యంగా వచ్చిన భూమిని సర్వే చేయండి మొర్రో అని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ సంవత్సరం నుండి ప్రదక్షిణలు చేస్తున్నాడు ఆంజనేయులు అనే రైతు.
ఃఎమ్మార్వో ఆఫీసు వాళ్లు  ఇప్పుడు అప్పుడు అంటూ  వాయిదా వేస్తు వస్తున్నారు. ఎమ్మార్వో ఆఫీసులు ఇలా వాయిదావేశారంటే దాని అర్థం చదువుకున్నవా ళ్లందరికి అర్థమయి ఉంటుంది.  చివరకు ఆ నిరుపేద రైతు భూమికే తహసీల్దారే  ఎసరు పెట్టింది.
రియల్టర్ల తరఫున పనిచేయడం మొదలుపెట్టిన  తహసీల్దార్ భారీ మొత్తంలో నగదు తీసుకుని న్యాయం చేయకుండా రియల్టర్ లకు వత్తాసు పలుకుతూ సర్వే చేయించడం లో జాప్యం చేస్తూ వస్తోందని ఆంజనేయులు వలవల ఏడుస్తూ చెబుతున్నాడు.
మూడు నెలల క్రితం కలెక్టర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ బాధితుని కి న్యాయం జరగలేదని ఆయన చెబుతున్నాడు.
కొన్ని సందర్భాల్లో వ్యవసాయ శాఖ మంత్రి పేరు చెప్పి సర్వే జరగకుండా వాయిదాలు వేస్తూ వచ్చింది.
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామ శివారులో ఉన్న 208 సర్వే నెంబరు లోని రైతు ఆంజనేయులు తల్లి పేర 1ఎకరా 26 గుంటల భూమి ఉంది. కారణం ఆ భూమి జాతీయరహదారి పక్కనే ఉండటం.
ప్రధాన రహదారి పక్కన ఉండటంతో కొంత మంది రియల్టర్ లు ఇప్పటికే కొంత కబ్జా చేసారు. బాధితుడు సర్వే కోసం దరఖాస్తు చేసినప్పటినుండి రియల్టర్ లనుండి బెదిరింపులు, మధ్యవర్తులతో బేరసారాలు చేయడం ప్రారంభించారు. రైతు వినలేదని నేరుగా బెదిరింపులకు పాల్పడ్డారు. పెబ్బేరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు.
ప్రస్తుత తహసీల్దార్ సుజాత  నేడు రేపు అనుకుంటా సర్వే చేయకపోవటాన్ని రైతు నిలదీశాడు.  చివరకు  సర్వే చేసేందుకు సర్వేయర్ వెళ్లాడు. అయితే తహసీల్దార్ ఫోన్ చేయటం తో సర్వే చేయకుండా ఆయన వెనక్కి రావటంతో మనస్తాపానికి గురైన ఆంజనేయులు తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగడానికి ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు.
ఆందోళన చెందిన రైతు ఈ తహసీల్దార్ ఉన్నంత వరకు నా భూమి నాకు రానివ్వకుండా అడ్డుపడుతుంది. అంటూ వెంట తెచ్చుకున్న పెట్రోలు తో నేరుగా తహసీల్దార్ చాంబర్ లో పెట్రోలు పోసుకుని అంటించుకుంటుండగా కార్యాలయ సిబ్బంది, తదితరులు కుండలో నీరు పోసి రక్షించారు.
 ఈ తహసీల్దార్ లు మారరా. పేదరైతులు, బాధితులు ఆత్మహత్య ల బారిన పడాల్సిందేనా అంటూ స్థానికులు తహసీల్దార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.