ఎమ్మార్వో విజయారెడ్డి అకాల మృతితో రెవెన్యూ వ్యవస్థ కళ్ళు తెరుస్తుందా?

అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి దారుణ హత్యతో  తెలంగాణ సమాజంలో  పెద్ద చర్చ మొదలయింది. ఈ విషాద సంఘటన జరిగి ఉండాల్సింది కాదు.అయితే, ఈ సంఘటన ఒక రెవిన్యూ శాఖలో మితిమీరిన అవినీతి గురించిన చర్చ లేవనెత్తింది.
ఈచర్చకు  సోషల్ మీడియా వేదిక అయింది. హంతకుడు ఎవరు, ఏమిటి, ఆమెను హతమార్చేదాకా ఎందుకు వెళ్లాడో చూడాలని ఒక వర్గం సలహా ఇస్తుంది.
తెలంగాణలో  చాలా మంది రైతులు ఈ రెవిన్యూఅధికారులు వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని, భూములు పొగొట్టుకున్నారని చాలా మందికి తెలుసు.
ముఖ్యమంత్రి స్వయంగా రెవిన్యూ శాఖ గురించి వ్యాఖ్యానించాక ఇక ఈ శాఖ అవినీతి గురించి పెద్ద గా చర్చించుకోనవసరం లేదు.
మొత్తానికి రెవిన్యూశాఖలో పేరుకుపోయిన సిస్టమిక్ కరప్షన్ కు, దానికి వత్తాసు పలుకుతున్న రాజకీయ నాయకుల నెపాటిజానికి వియారెడ్డి బలయ్యారని  అంతా చెబుతున్నారు. ఇలా చెప్పని రాజకీయపార్టీ లేదు.

అంతేకాదు, ఇక నైనా రెవిన్యూ వాళ్లు  లంచం  తీసుకోబోమని శపథం చేసి ఆమె ఆత్మకు శాంతి చేకూరేలా చూడాలని కోరుతున్నారు.

చాలా చోట్ల ఆమె హత్యను నిరసిస్తూ రెవిన్యూ వాళ్ల చేస్తున్న ధర్నాను ఎగతాళిచేస్తున్నట్లు వార్తొలొచ్చాయి.
కొంతమంది ఏ ఎమ్మార్వో తమదగ్గిర ఎంత డబ్బు తీసుకున్నారో వెల్లడిస్తున్నారు.
హైదరాబాద్ ఎల్ బి నగర్ రోడ్డలో వుండే గ్రీన్ హిల్స్ కాలనీలో విజయారెడ్డి ఇంటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఒక టీచర్ బిడ్డగా ఎదిగి ఎమ్మార్వో అయిన విజయారెడ్డి ఇంత ఆస్తి ఎలా వచ్చిందనే ప్రశ్నవేస్తున్నారు.
మొత్తానికి తెలంగాణలో రెవిన్యూ శాఖ మీద రోత పుట్టేలా చర్చ నడుస్తూ ఉంది.
విచిత్రమేమంటే, ఎక్కడా రెవిన్యూవాళ్లకు మద్దతుగా ఒక ప్రకటన రావడం లేదు.. ఒక్క మాట వినిపించడం లేదు. అన్నీ ఇలాంటి ప్రశ్నలే వస్తున్నాయి.
చనిపోయిన తహశీల్దార్ విజయ గురించి తప్పితే, చావు బ్రతుకుల మధ్య ఉన్న సురేష్ గురించి ఎందుకు ఆలోచించట్లేదు….??? ఒక  వాట్సాప్ పోస్టు ప్రశ్నిస్తూ ఉంది. ఈ పోస్టును ఇక్కడ అందిస్తున్నాం.
ఇప్పటివరకు భూసమస్యలు పరిష్కారం కాక వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మరి  ఏ ఒక్క తహశీల్దార్ అయినా ఆత్మ హత్య చేసుకున్నారా అని ఈ పోస్టు ప్రశ్నిస్తున్నది.
తహశీల్దార్ ప్రాణానికి విలువుంది, వేలాది మంది పేద రైతుల ప్రాణాలకు విలువ లేదా…???? అని చాలా మంది నిలదీస్తున్నారు.
ఒక విషాద సమయంలో చాలా ఇబ్బందికరమయిన ప్రశ్నలొస్తున్నాయి.
*తహసీల్దార్ కార్యాలయం లోనే ఒక రైతు తహసీల్దార్ పై కిరోసిన్ పోసి నిప్పంటించేయాలనుకున్నంత కసిని పెంచుకుని వచ్చి హతమార్చాడంటే, ఆ తహశీల్దార్ ఆ రైతును లంచం కోసం ఎన్ని రోజులు, మరెన్ని విధాలుగా ఇబ్బంది పెట్టుంటుందో ఊహించండి…..!?
ఎంత నరకం చూపించిందై ఉంటుందో ఆలోచించండి..! అని సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులొస్తున్నాయి.
హంతకుడు బాధితుడు అని ఆంధ్ర జ్యోతి పత్రిక ఒక ఆడియోని వెల్లడించింది.ఇక్కడ ఆడియో వినండి.
ఈ వ్యవహారంలోరాజకీయ నాయకులు ప్రమేయం ఉందని అనుమానాలు నిన్న సిపిఐ నారాయణ మొదట పేరుపెట్టి వ్యక్తం చేశారు. స్థానిక టిఆర్ ఎస్ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ పేరు ఇపుడు ప్రచారంలోకి వస్తున్నది. ఇది గో నారాయణ కామెంట్ వీడియో.

https://trendingtelugunews.com/telugu/breaking/cpi-narayana-comments-on-mro-burning-case-in-telangana/

అలాంటి విపత్కర పరిస్థితుల్లో చివరి యత్నంగా, నా ప్రాణం పోయినా ఫర్వాలేదు అనే ఉద్దేశ్యంతో నే దాడికి పాల్పడ్డాడేమో గానీ, అక్రమంగా లంచాలు తీసుకుని అన్యాయంగా డబ్బు సంపాదించాలని కాదుకదా!! అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
వేలాది మంది రైతులు చనిపోతే ఒక్కడు స్పందించడు గాని ఇప్పుడు ఎవరో ఒక తహసీల్దార్ చనిపోతే భూకంపమే వచ్చినట్టు మాట్లాడుతున్నారు…
ఆ రైతు తహసీల్దార్ ను చంపితే అతనికి ఏమైనా కోట్లు వస్తాయా లేక ఆమె ఆస్తులు వస్తాయా ఆలోచించండి…. లేదా అతడు అక్రమంగా వేరొకరి భూమిని తన పేరిట చేయమన్నాడా..?
అతను అక్రమార్కుడే అయితే భూమి మాట దేవుడెరుగు కానీ, తానుకూడా చావుకు సిద్దపడ్డాడు కదా, మరి అతను అక్రమార్కుడెలా అవుతాడు…..!!!???
అతనికే కాదు, లంచావతారాలైన అధికారుల మీద  ప్రతి ఒక్కరికీ  కసి ఉంటుంది కానీ వాళ్ళ కాళ్ళవేళ్ళా పడడం తప్ప ఇంకేం చేయలేరు,
కాకపోతే ఓ రైతు ఒకే ఒక అడుగు ముందుకు వేసి ఇలా ఎమోషనల్ గా చేసాడు…… అది ముమ్మాటికీ తప్పే నేను కాదనను కానీ ఎందుకు అలా చేయవలసి వచ్చిందో విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!
ప్రతీ రెవెన్యూ ఉద్యోగి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది
ఏ కార్యాలయం లో చుసినా ఇదే తంతు లంచం.. లంచం… ప్రతీదానికి లంచం..బర్త్ సర్టిఫికేట్ కు లంచం.. లైవ్ సర్టిఫికేట్ కు లంచం… ఆఖరికి డెత్ సర్టిఫికేట్ కు కూడా లంచం….! పాసుబుక్ ఇవ్వాలంటే లంచం… వచ్చిన పాసుబుక్ తీసుకోవాలంటే లంచం… వచ్చిన పాస్ బుక్ ఉండాలంటే లంచం…. వేరోడికి మన భూమి పట్టా చేయకుండా ఉండాలన్నా లంచం……లంచం లంచం….లంచం…!
ఆ రైతుపై కావాలని బురద చల్లకండి…. అతను చేసిన పనికి తప్పు పట్టవచ్చు కానీ, ఎందుకు చేసాడో ‘తెలిసిన’ ఆ పనికి ఊరికెనే అతడిని తప్పు పట్టొద్దు ప్లీజ్…!
తహశీల్దార్ విజయ ఆత్మ కు శాంతి కావాలంటే, ఇదే మొదటి మరియు చివరి హత్యాకాండగా చరిత్రలో నిలిచిపోవాలంటే సామాన్యుల పట్ల కనికరం చూడండి, కార్యాలయాల చుట్టూ చోటికి మాటికి తిప్పకుండి, ముఖ్యంగా లంచాలు ముట్టకుండా మీకొచ్చే వేలాది,లక్షలాది రూపాయల జీతాలతో మీ జీవితాలను ఎంజాయ్ చేయండి…… లేదు, కాదు, కూడదు అంటే కోట్లు కూడబెట్టినా ఎప్పుడు, ఎక్కడ, ఎలా బలౌతారో తెలియకుండా బలిపశువులౌతారు…. తస్మాత్ జాగ్రత్త……!
రెవిన్యూ వాళ్ల లో హృదయముంటే వాళ్లంతా తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చి ఉంటే ‘ మా రక్తంలోకి అక్రమ సంపాదన ప్రవహించదు ’ అని సామూహిక శపథం చేయగలరా? లేక పోతే విషాద సంఘటనలు ఏదో రూపంలో పునరావృతమవుతూనే ఉంటాయి.

(feature image NPNews24)