తహశీల్దార్ సజీవదహనంపై మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం

అబ్దుల్లాపూర్ మెట్ తహశిల్దార్ విజయారెడ్డిపై తహశిల్దార్ కార్యాలయంలోనే కిరోసిన్ పోసి సజీవదహనం చేయాడాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్రంగా ఖండించారు.
ఈ దహనకాండకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జీ కలెక్టర్ ను ఆదేశించారు.
మహిళా అధికారులపై ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు.
 వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం
అబ్దుల్లాపూర్ మెట్ తహశిల్దార్ విజయారెడ్డిపై కిరోసిన్ పోసి సజీవదహనం చేయడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ .. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు.
పద్మా చారి తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
అబ్దుల్లా పూర్ ఘటన చాలా బాధాకరం,దురదృష్టకరం
రాజకీయ నాయకులు ఉద్యోగులు సరిగా పని చేయడం లేదని అని పదే పదే  అనడం వలన జనాలకు ఉద్యోగుల మీద ఇలాంటి అప నమ్మకం పెరుగుతుంది. ఇది సరైనది కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు సరైన స్థానం కల్పించాలి. ప్రభుత్వం ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరుతున్న
కొంత మంది ఉద్యోగులు అటు ఇటు ఉండవచ్చు కానీ అందరిని అదే కోణం లో చూడకూడదు.ఇలాంటి ఘటన ఉద్యోగులకు భద్రత పై అపనమ్మకం ఏర్పడుతుంది
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి