డ్యూటీలో చేరిన కామారెడ్డి డ్రైవర్, ఏమంటున్నాడో చూడండి (వీడియో)

కామారెడ్డి డిపోకు చెందిన సయ్యద్ అహ్మద్ ఆర్టీసీ రెగ్యులర్ డ్రైవర్ (స్టాఫ్ నెంబర్ 318188 ) ని న్న ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన హెచ్చరికకు స్పందించారు. ఆయన డ్యూటీలోచేరేందుకు సిద్ధమయ్యారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల తర్వాత ఇక సమ్మెఫినిష్ అంతా పోలో మనిడ్యూటిలో చేరిపోతారనుకున్నారు. ఎందుకంటే రాజు అనే కండక్టర్ ఇలా డ్యూటీ చేరాడు. ఆర్టీసి జెఎసి నాయకుడు అశ్వత్ధామ రెడ్డి మీద పోలీసులకు కూడా ఫిర్యాదు  చేశాడు. అయితే,  అలాజరగ లేదు. ఎవరూ ఆరోజు గంట సేపు మీడియా సెలెబ్రిటీ అయిన రాజు వెంట ఎవరూ నడిచిరాలేదు.

ఇపుడు నిన్న కెసిఆర్ అయిదో తేదీన వరకు అని పెట్టిన డెడ్ లైన్ చూపి బెదిరిపోయిన  ఒకరిద్దరు డ్యూటీలో చేరేందుకు ముందుకువచ్చారు.
వారిలో సయ్యద్ అహ్మద్ ఒకరు. ఇదొక ఒక వరవడి అవుతుందా ?చూడాలి.
నివాసం పాత బస్టాండ్ కామారెడ్డి
డ్యూటీ చేస్తానని డివిఎమ్  గణపతి రాజు గారికి రిపోర్ట్ చేసినారు.
ఇలాగే.. మేడ్చల్ జిల్లా ఉప్పల్ డిపోలో
కేశవ కృష్ణ, అసిస్టెంట్  డిపో మేనేజర్, ఉప్పల్ డిపో మేనేజర్ కు  డ్యూటీలో జాయిన్ అవుతున్నట్లు లెటర్ ఇచ్చారు.  తాను 6 వ తారీఖు విధుల్లో చేరనున్నట్లు కేశవ కృష్ణ తెలిపారు (ఫోటో).
ఇలాగే భద్రాచలానికి చెందిన శేషాద్రి అనే డ్రైవర్ కూడా డ్యూటీ చేరేందుకు వచ్చాడని, అయితే ఆయన యూనియన్ లీడర్లు దాడి చేశారని సమాచారం అందింది. వివరాలు తెలియాల్సి వుంది.