తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి- బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు

ఢిల్లీ లో లాగా  తెలంగాణలో కూడా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్తితులున్నాయని  బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు.
 ‘ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు.డెంగీ, విష జ్వరాలను నియంత్రించటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది.ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సులు, డాక్టర్లు, టెక్నీషియన్స్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంపై క్రిమినల్ కేసులు పెట్టాలి,’ అని చెబుతూ   హెల్త్ ఎమర్జన్సీ  ప్ర  కటించేందుకు ఇంతకంటే కారణాలేముంటాయని ఆయన అన్నారు.
‘ప్రజల ఆరోగ్యం కోసం కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది.ఆరోగ్యశాఖ మంత్రిపై ఉన్న కోపాన్ని ముఖ్యమంత్రి ..ప్రజలపై చూపించటం సరైంది కాదు.ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాల కొరత తీవ్రంగా ఉంది.ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి.నిధులు కొరతతో ప్రజల కనీస అవసరాలు తీర్చలేని స్థితిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలున్నారు,’ అని రామచంద్రరావు అన్నారు.
ఇది ఇలా ఉంటే  సుప్రీం కోర్టు నియమించిన పర్యావరణ కాలుష్య నివారణ మండలి ఢిల్లీ-రాజధాని ప్రాంతంంలో హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించింది.
నవంబర్ అయిదో తేదీ దాకా నగరంలో ఎలాంటి నిర్మణ కార్యక్రమాలు చేపట్టరాదని ప్రకటించింది. ఈ మేరకుఢిల్లీ హర్యానా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రా ప్రధాన కార్యదర్శులకు ఎన్విరాన్ మెంట్ పొల్యూషన్ (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ )అధారిటీ (EPCA)భూరే లాల్ ఒక లేఖ రాశారు.
ఢిల్లీలో వాయు కాలుష్యం బాగాదిగజారి పోయిందని అతి తీవ్ర (severe plus) స్థాయిలో ఉంద‌ని చెబుతూ దీనిని పబ్లిక్ హెల్త్ ఎమర్జన్సీగా పరిగణించాల్సి వస్తుందని ఆయన ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇది అందరి ఆరోగ్యాన్ని ముఖ్యంగా పసిపిల్లలఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన హచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ ఫరీదాబాద్, గురుగ్రామ్, ఘాజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడాలలో హాట్ మిక్సింగ్, స్టోన్ క్రషింగ్ తదితర నిర్మాణ కార్యకమాలను నవంబర్ అయిదు దాకా నిలిపివేయాలని ఆయన సూచించారు.
ఢిల్లీ ఓ గ్యాస్ చాంబ‌ర్‌లా త‌యారైంద‌ని ఈ రోజు ఢిల్లీముఖ్యమంత్రి సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు.