వైరలయిన వొడాఫోన్ వార్త, స్పందించని కంపెనీ

వొడాఫోన్ మూటా ముళ్లెే సర్దుకుని ఇండియా వదిలేసి పొవాలనుకుంటున్నది. ఈ వార్త  బాగా వైరలయింది. అయితే, కంపెనీ నుంచి ఇంకా స్పందన రాలేదు. కంపెనీలు ప్రతినిధులు  వైరలవుతున్న వార్త మీద స్పందన కోరితే, అవసరమయినపుడు స్పందిస్తామని మాత్రం చెప్పారు.

ప్రతినెలా లక్షలాది మంది సబ్ స్క్రైబర్లు, వొడాఫోన్ ను వదిలేస్తూ ఉండటం,  కంపెనీకి బాగా నష్టాలు వస్తూండటంతో ఇక ఇండియా లో బతకలేమనే నిర్ణయానికి వచ్చి, దేశం వదలివెళ్లాలనుకుంటున్నట్లు ఒక వార్త చక్కర్లు నిన్నటినుంచి కొడుతూఉంది.

ఈ మధ్య వొడాఫోన్ కుబాగా నష్టాలొచ్చాయి. ఐడియాను కలిపేసుకున్నప్పటికి నుంచి వొడాఫోన్ కు ఒకటే నష్టాలు. అందువల్ల పెట్టుబడి సమీకరించుకుని విస్తరించే అవకాశం లేకపోవడంతో ఇక దుకాణం మూసేయడమే మార్గమని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. 2019లో జూన్ తో ముగిసిన క్వార్టర్ లో ఈ కంపెెనీకి రు 4,067 కోట్ల నస్టం వచ్చింది. 2018లో ఇదే కాలానికి వచ్చిన నష్టం రు. 2757 కో్ట్లు.నష్టం ఎంత పెరిగిందో అర్థమవుతుంది.