మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా ప్రభుత్వం ఏర్పాటుచేయలేని దయనీయ స్థితిలో మహారాష్ట్ర బిజెపి పడిపోయింది.
ముఖ్యమంత్రి పదవి విషయంలో బిజెపికి, మిత్రపక్షం శివసేనకు మధ్య సయోధ్య కుదరడం లేదు. ఎన్నికలయి చాలా రోజులు గడిచినా మహారష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడానికి కారణం ఇదే. ఈ రెండు పార్టీలు గత ప్రభుత్వంలో భాగస్వాములే. ఈ సారి పొత్తుతోనే పోటీ చేశాయి. బిజెపి అందరికంటే పెద్ద పార్టీగా వచ్చింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజారిటీ రాలేదు. తప్పని సరిగా శివసేన సాయం అవసరం.
అయితే, ప్రభుత్వంలో చేరేందుకు రెడీ యే గాని, ఈ సారి తమకు ముఖ్యమంత్రి పదవి కేటాయించాలని శివసేన మారాము చేస్తా ఉంది. ఈ విషయంలో రాజీ లేదని, తమకు ఈ పదవి కేటాయించాల్సిందేనని శివసేన పట్టుబట్టింది.
గురువారం నాడు ఈవిషయాన్ని మరొక సారి స్పష్టం చేసింది. బిజెపికి మిత్రపక్షాలను వాడుకుని వదిలేయడం అలవాటేనని, ఇపుడు శివనసే మీద రెండో నాటకానికి (వదిలేయడం) తెరతీస్తూ ఉందని సేన అధికార పత్రిక సామ్నా వ్యాఖ్యానించింది.
ముఖ్యమంత్రి పదవి. పదవుల పంపకం గురించి ఎపుడో లోక్ సభ ఎన్నికల ముందే ఒప్పందం జరిగిందని, దానిని ఇపుడు అమలుచేయాల్సిందేనని శివసేన చెబుతూ ఉంది.
అయితే, ముఖ్యమమంత్రి ఫడ్నవీస్ మాత్రం ముఖ్యమంత్రి పదవి పంపకానికి రాదని, అది బిజెపి సొత్తు అని మొన్న విలేకరులతో సమావేశంలో స్పస్టం చేశారు.
పదవులను 50-50 నిష్పత్తిలో పంచుుని ముఖ్యమంత్రి పదవిని రొటేషన్ పద్దతిలో పంచుకోవాలని ఎపుడో నిర్ణయమయింది. ఇపుడు ముఖ్యమంత్రి పంపకానికి రాదంటే రాజకీయాల సిలబస్ తిరగరాయల్సివస్తుందని గురువారం నాడు పార్టీ శఆసన సభ్యలు సమావేశంలో ప్రసంగిస్తూ పార్టీ అధినేత ఉద్దవ్ థాకరే అన్నారు.
మొన్న ఎన్నికల్లో బిజెపికి 105 సీట్లు వస్తే, శివసేనకు 56 సీట్లు లిభించాయి. బిజెపి ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే మరొక 40 ఎమ్మెల్యేల మద్దతు కావాలి. అసెంబ్లీలో 288 స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో బిజెపికి 122 స్థానలుండేవి. ఈసారి పడిపోయాయి.
మోదీ కొండంత మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా మహారాష్ట్రలో బిజెపి సీట్లుతగ్గడం ఆశ్చర్యం. ఈ సారి అసెంబ్లీలో 29 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు.వీళ్లంతా కూడా మద్దతునిచ్చినా ప్రభుత్వం ఏర్పాటుచేయడం కష్టం.
వీళ్లలో కొందరు శివసేన గ్రిప్పులో ఉన్నారు. అందువల్ల బిజెపికి ప్రభుత్వం ఏర్పాటుచేందుకు అవసరమయిన నంబర్ రావడం చాలా కష్టం.
మోదీనాయకత్వంలో గెలిచినా బిజెపి కి ఆనందంలేకుండాపోయిది.ఏమవుతుందోననే టెన్షన్.
అటువైపు శివసేన ప్రభుత్వం చేస్తే ఎన్ సిపి మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉంది. బిజెపికి వ్యతిరేకంగా శివసేనతో మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయించాలనే ఎన్ సిపి నేత శరద్ పవార్ ఆశయం. ఏమవుతుందో చూడాలి. చివరకు శివసేన బిజెపి నెంబర్ టు అమిత్ షా మాట కూడా వినడం లేదు.